Tributes pour in for Jayaprakash Reddy నవ్వులు పండించే ఆజానుభావుడు జయప్రకాశ్ రెడ్డి ఇకలేరు..

Tributes pour in for veteran actor jaya prakash reddy

jaya prakash reddy, jayaprakash reddy, jp reddy, jaya prakash reddy dead, jaya prakash reddy dead, jaya prakash reddy dies, jaya prakash reddy died, telugu comedian, Sarileru Neekevvaru, versatile actor, villian, heart attack, Guntur, movies, entertainment, tollywood

Tributes pour in for actor Jaya Prakash Reddy, who passed away early Tuesday at his residence in Guntur, Andhra Pradesh following a heart attack. Film Industry Heros, co actors, drama artists, politicians condolence the death of Jaya Prakash Reddy

జయప్రకాశ్ రెడ్డి మరణం పట్ల ప్రముఖుల సంతాపం..

Posted: 09/08/2020 04:31 PM IST
Tributes pour in for veteran actor jaya prakash reddy

టాలీవుడ్ నటనాజానుభావుడు జయప్రకాశ్ రెడ్డి హఠాన్మరణంలో తెలుగు సినీరంగం ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో బాత్ రూమ్ లోనే కుప్పకూలిపోయిన ఆయన మరణవార్తను తెలుసుకున్న తెలుసు సినీ, రాజకీయ ప్రముఖులు అయన మరణం పట్ల తమ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. తెలుగు రంగస్థల నటుడిగా పలు అవార్డులు అందుకున్న ఆయన.. తన విలక్షణ అభినయంతో ప్రేక్షకాదరణను పోందారు. ఇక సినిమాల్లోకి మూడు దశాబ్దాలుగా అనేక పాత్రలను పోషించి.. కమేడియన్ గా కూడా రాణించి.. కామెడీని పండించడంలో తనదైన ముద్రవేశారు.

1946 అక్టోబర్‌ 10న జన్మించిన జయప్రకాశ్‌ రెడ్డి.. మరో నెల రోజులు జీవించివుంటే 75 వసంతాలను పూర్తి చేసుకునేవారు. కానీ సెప్టెంబర్ 9నే ఆయన పరమపదించారు. ఆయన మరణవార్త పట్ల తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ తెలుగు చలనచిత్ర రంగం ఓ వజ్రాన్ని.. రంగస్థలం ఓ నటరత్నాన్ని కోల్పోయిందని అవేదన వ్యక్తం చేశారు. ద‌శాబ్దాలుగా ఆయ‌న ఇచ్చిన‌ బహుముఖ ప్రదర్శనలు మ‌న‌కు ఎప్ప‌టికీ గుర్తిండిపోతాయన్నారు. ఆయ‌న కుటుంబానికి, మిత్రుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

జయప్రకాశ్ రెడ్డి మరణంపై తన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన మరణం సినీరంగానికి తీరని లోటని అన్నారు, ఆయనతో తాను ఖైదీ నెంబర్ 150 చిత్రంలో నటించానని అన్నారు. రంగస్థలం నన్ను కన్న తల్లి.. సినీరంగం నన్ను పెంచిన తల్లి అని చెప్పే ఆయన .. శని, అదివారాల్లో ఎలాంటి సినిమా షూటింగులు లేకుండా రంగస్థల నటనకు ఆ రెండు రోజులను కేటాయించేవారని చిరంజీవి అన్నారు. మీరెప్పుడైనా అవకాశం దొరికితే రావాలని కూడా తనను అహ్వానించారని, అయితే ఆ అవకాశాన్ని తాను పొందలేకపోయానని చిరంజీవి పేర్కోన్నారు. రాయలసీమ ఫ్యాక్షనిజం అనగానే మొదట గుర్తుకువచ్చేది జయప్రకాశ్ రెడ్డి అని, ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రెంట్ క్రీయేట్ చేసుకున్నారని అన్నారు చిరంజీవి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు.

జయప్రకాశ్ రెడ్డి హఠాన్మరణం పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు టీడీపీ యువనేత నారా లోకేష్. జయప్రకాశ్ రెడ్డి మ‌ర‌ణవార్త విని చాలా బాధ‌ప‌డ్డానన్నారు. ఆయన చాలా నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేసేవారు. ప్ర‌తి పాత్ర‌లో తన ఔనత్యాన్ని చాటుకునేలా ప్రదర్శనలు చేశారని అన్నారు. స‌మ‌ర‌సింహారెడ్డి సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా అద్భుతంగా న‌టించారన్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి వ్యక్తంచేశారు.

జయప్రకాశ్ రెడ్డి హఠాన్మరణం తెలుగు సినీపరిశ్రమకు తీరని నష్టమని అన్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. అనేక విభిన్నమైన చిత్రాలలో తద్భిన్నమైన పాత్రలలో నటించిన జయప్రకాశ్ రెడ్డి అబాలగోపాలాన్ని అలరించారని అన్నారు. ఆయన అత్మకు శాంతి కలగాలని కోరారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేశారు.

తన ప్రియ మిత్రుడు జయప్రకాశ్ రెడ్డి మ‌ర‌ణవార్త తనను కలిచివేసిందని.. ఆ వార్త విని తాను చాలా బాధ‌ప‌డ్డానన్నారు విక్టరీ వెంకటేష్. వెండితెర‌పై తమ కాంబినేష‌న్ అద్భుతంగా ఉండేదన్నారు. ఆయ‌న‌ను చాలా మిస్ అవుతానని. ఆయ‌న కుటుంబానికి తన ప్ర‌గాఢ సానుభూతి తెలుపారు వెంక‌టేశ్.

'జయప్రకాశ్ రెడ్డి గారి మ‌ర‌ణవార్త విని బాధ‌ప‌డ్డాను. టాలీవుడ్ ‌లో ఆయ‌న‌ ఓ గొప్ప క‌మెడియ‌న్. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసిన రోజులు ఎప్ప‌టికీ గుర్తుంటాయి. ఆయ‌న కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నాను' అని సినీన‌టుడు మ‌హేశ్ బాబు ట్వీట్ చేశారు.

'అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాశ్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అని సినీన‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ పేర్కొన్నాడు.

జయప్రకాశ్‌ రెడ్డి హఠాన్మరణం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు సినీనటుడు ప్రకాశ్ రాజ్. నటనంటే ఆయనకు ప్రాణమని అన్నారు. అటు వెండితెరపైన, ఇటు స్టేజ్ నాటకాలలోను పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన నటుడాయన. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని ప్ర‌కాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

'మాకు ఎంత‌గానో వినోదాన్ని పంచినందుకు థ్యాంక్యూ స‌ర్' అని సినీన‌టుడు రామ్ పోతినేని ట్వీట్ చేశాడు.

'ఉద‌యం లేస్తూ ఈ విషాద‌క‌ర వార్త విన్నాను. మీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి స‌ర్' అని సినీన‌టుడు సుధీర్ బాబు అన్నాడు.

‘‘మీరు లేని లోటు పూడ్చలేనిది.. మీరు లేరన్న వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది.. నటదిగ్గజం లేరన్న వార్తతో దు:ఖితుడ్ని అయ్యాను.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని నటుడు సత్వదేవ్ ట్వీట్ చేశారు.

'టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి గుంటూరులో గుండెపోటుతో మరణించడం బాధాకరమని ఆంద్రప్రదేశ్ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకమైన స్లాంగ్ తో తెలుగు సినీ ప్రేక్షకులకు చెరగని ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన సంతాపాన్ని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని సోము వీర్రాజు అన్నారు.

వీరితో పాటు రాధాకృష్ణ, దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, రితేష్ దేశ్ ముఖ్, ఆయన సతీమణి జెలీనియా, మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మాలినేని, శ్రీకాంత్, హన్సికా మోత్వాని, రాధిక శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, నవదీప్, ఎస్ఎస్ థమన్, లక్ష్మీ మంచు తదితరులు కూడా ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh