Nayanthara not to reunite with ex lover నయనతార, ప్రభుదేవా కలసి నటిస్తున్న ప్రాజెక్టుపై క్లారిటీ

Producer says nayanthara and prabhudeva coming together for his film is baseless rumour

Karuppu Raja Vellai Raja, Nayanthara, Prabhudheva, ex lover, former boy friend, Ishari K Ganesh, Karthi, Vishal, filmi rumours, film news, Kollywood, movies, entertainment

Rumours in the industry doing rounds that the Project 'Karuppu Raja Vellai Raja' with Prabhudheva's directorial is going on to the sets, which was first announced in 2017. But producer Ishari K Ganesh has said, 'These are baseless rumours. My film with Prabhudheva, Karthi and Vishal got shelved long ago and will not be revived anytime soon.'

నయనతార, ప్రభుదేవా కలసి నటిస్తున్న ప్రాజెక్టుపై క్లారిటీ

Posted: 06/04/2020 06:50 PM IST
Producer says nayanthara and prabhudeva coming together for his film is baseless rumour

నటుడు, దర్శకుడు, కోరియోగ్రాఫర్ ప్రభుదేవా, అగ్రకథానాయిక నయనతార తన సినిమాలో కలసి నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై నిర్మాత ఈశ్వరీ కె గణేశ్ స్పందించారు. తన చిత్రంలో ప్రభుదేవా, నయనతార కలసి నటించడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రభుదేవా దర్శకత్వంలో ఈశ్వరీ నిర్మాతగా ఓ చిత్రం కొన్నేళ్ల కిందటే ప్రారంభమైంది, అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం నిలిచిపోయింది. ఈ చిత్రంలో విశాల్, కార్తీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కొంత షూటింగ్ కూడా పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆ తరువాత నిలిచిపో్యింది.

కాగా తాజాగా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి తోడు ఈ చిత్రంలో ప్రభుదేవా, నయనతార కూడా జంటగా కలసి నటిస్తున్నారన్న వార్త విపరీతంగా చక్కర్లు  కొడుతోంది. దీంతో ‘‘కరుప్పు రాజా వెలై రాజా’ నిర్మాత ఈశ్వరీ సదరు వార్తలపై స్పందిస్తూ.. అవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పారు. ప్రభుదేవా దర్శకత్వంలో కార్తీ, విశాల్‌ ప్రధాన పాత్రల్లో నేను నిర్మించాలనుకున్న సినిమా కొన్ని సంవత్సరాల క్రితమే వాయిదా పడింది. ఇప్పుడు ఆ సినిమాను పూర్తిచేయాలనే ఉద్దేశం నాకు లేదు’ అని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karuppu Raja Vellai Raja  Nayanthara  Prabhudheva  Ishari K Ganesh  Karthi  Vishal  Kollywood  

Other Articles