Junior NTR shares family pic with fans ఫ్యాన్స్ కు హోలీ పండగ గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్

Holi celebrations in tollywood junior ntr s family pic

Junior NTR, Junior NTR family pic, Junior NTR sons, Abhay ram, bhargava ram, RRR, ntr, Mahesh Babu, Kajal Aggarwal, Holi, celebrities, tollywood, movies, entertainment

Junior NTR took to his social handle and posted a family pic from his Holi celebration. Along with the RRR actor, the adorable pic has NTR’s wife Lakshmi Pranathi and their two kids; Abhay Ram and Bhargava Ram.

టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి హోలి శుభాకాంక్షల వెల్లువ..

Posted: 03/10/2020 03:18 PM IST
Holi celebrations in tollywood junior ntr s family pic

హోలీ పండగను పురస్కరించుకుని తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు సెలబ్రిటీలు తెలుగు ప్రేక్షకులకు పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తొలుత తమ ఫ్యాన్స్ పండగ సంరద్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కు హోలీ పండగ నేపథ్యంలో చక్కని గిఫ్ట్ అందజేశారు. కొద్దిసేపటి క్రితం యంగ్ టైగర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫ్యామిలీ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులకు, తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు హోలీ శుభాకాంక్షలు చెబుతూ భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి, కుమారులు అభ‌య్ రామ్‌, భార్గ‌వ్ రామ్ ల‌తో క‌లిసి ఉన్న ఫొటోను ఎన్టీఆర్ షేర్ చేశాడు.

ఈ ఫొటోను ఎన్టీయార్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఎన్టీయార్ ఫొటోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభించింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ ఫొటోపై స్పందించాడు. ఎన్టీయార్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ గురించి కామెంట్ చేశాడు. `ఎన్టీయార్ చిన్న కొడుకు కెమేరా వైపు చూస్తున్న విధానం ఏమి చెబుతోందంటే.. వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు. లిటిల్ టైగర్.. వస్తున్నాడు` అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు.

ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి, స్టైలిస్ స్టార్ బన్ని. హీరోయిన్ కాజల్ అగర్వాల్, అడవి శేష్, నాగ చైతన్య, బిగ్ బాస్3 తెలుగు రన్నర్ శ్రీముఖి, నటుడు, హీరో సుషాంత్.. హీరోయిన్ హన్సిక, యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా.. తదితరులు తమ అభిమానులకు రంగుల కేళీ రంగేలీ హోలీ పండగ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే ప్రభుత్వాలు ప్రజలకు పిలుపునిచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RRR  Junior NTR  Fans  Family pic  Mahesh Babu  Kajal Aggarwal  Holi  celebrities  tollywood  

Other Articles

Today on Telugu Wishesh