Sharwanand and Samantha's next titled 'Jaanu' శర్వానంద్ ‘జాను’ ఫస్ట్ లుక్ ఇదిగో.!

Sharwanand samantha s 96 telugu remake titled jaanu

samantha akkineni, sharwanand, jaanu, jaanu first look, 96 telugu remake, samantha, samantha jaanu, samantha akkineni jaanu, jannu, Tollywood, movies, entertainment

The Telugu remake of Tamil hit 96 has been titled Jaanu. The title was revealed along with the first look poster featuring Sharwanand. Filmmaker C Prem Kumar, who wrote and directed 96, is helming the Telugu remake too. Samantha Akkineni will step into the shoes of Trisha in the upcoming film.

శర్వానంద్ ‘జాను’ ఫస్ట్ లుక్ ఇదిగో.!

Posted: 01/07/2020 09:35 PM IST
Sharwanand samantha s 96 telugu remake titled jaanu

శర్వానంద్‌, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రానికి జాను అంటూ టైటిల్ ని ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ గా తీస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో ‘జాను’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అంతేకాదు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను అభిమానులతో పంచుకున్నారు. ఎడారిలో ఒంటెలను తాడుతో లాగుతూ శర్వానంద్‌ కనిపించారు.

‘షరతులు, నియమాలు, హద్దులు లేని ప్రేమకు అసలైన నివాళి’ అంటూ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రానికి సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘96’లో త్రిష, విజయ్‌ సేతుపతి జంటగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలతోపాటు సినీ ప్రముఖుల మెప్పు పొందింది. పాఠశాలలో త్రిష, విజయ్‌ల మధ్య ప్రేమ చిగురించడం.. కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరగడం.. మళ్లీ ఓ సందర్భంలో కలుసుకోవడం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles