Chiranjeevi in Telugu remake of Malayalam Lucifer రాంచరణ్-చిరంజీవి కాంబోలో హ్యాట్రిక్ మూవీ.!

Chiranjeevi to star in telugu remake of malayalam blockbuster lucifer

Chiranjeevi lucifer remake, Sye Raa Narasimha Reddy Lucifer, Lucifer Prithviraj, lucifer Ram Charan, lucufer Mohanlal. Lucifer telugu remake, Chiranjeevi, Sye Raa Narasimha Reddy, Prithviraj, Ram Charan, Mohanlal. Lucifer, tollywood , Movies, Entertainment

Actor Chiranjeevi, who awaits the release of forthcoming magnum opus Sye Raa Narasimha Reddy, will star in Telugu remake of recent Malayalam blockbuster Lucifer, its director Prithviraj has revealed.

రాంచరణ్ ప్రోడక్షన్స్ లో చిరంజీవి హ్యాట్రిక్ మూవీ.!

Posted: 09/30/2019 08:26 PM IST
Chiranjeevi to star in telugu remake of malayalam blockbuster lucifer

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తన బిజీ బిజీ షెడ్యూలు నడుమ తీరిక లేని లైఫ్ స్టైల్ ను లీడ్ చేస్తూ కూడా హ్యాపీగా వున్నాడు. ఒక వైపున వ్యాపారవేత్తగా, మరోవైపు తెలుగు చిత్రరంగంలో హీరోగా విభిన్నమైన చిత్రాలను చేస్తూనే, ఇంకో వైపున నిర్మాతగా కూడా రాంచరణ్ తన యవ్వనంలోనే బాధ్యతల బరువులను మోస్తూ కష్టపడుతున్నాడు. ఇక తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల నాటి కలను అత్యంత భారీ బడ్జెట్ తో పూర్తి చేసి మరికోన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

తన తండ్రి చిత్రసీమలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుసగా రెండు చిత్రాలను నిర్మించిన కొణిదెల ప్రోడక్షన్స్ అధినేత రాంచరణ్.. ఇక తన తండ్రి చిరంజీవి హీరోగా మరో భారీ ప్రాజెక్టులను తెరపైకి తెస్తూ హ్యాట్రిక్ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ భారీ ప్రాజెక్టు తెలుగు నిర్మాణ హక్కులను కూడా రాంచరణ్ సొంతం చేసుకున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో ఈ ఏడాది మార్చిలో వచ్చిన 'లూసిఫర్' అక్కడ ఘన విజయాన్ని దక్కించుకుంది.

మోహన్ లాల్ స్థాయిని మరింతగా పెంచిన చిత్రంగా నిలిచింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను చరణ్ దక్కించుకున్నాడు, ఈ విషయాన్ని సైరా చిత్ర ప్రోమోషన్ లో భాగంగా దర్శకుడు పృధ్వీరాజ్ బయటపెట్టారు. దీంతో మరో భారీ ప్రాజెక్టు రాంచరణ్ చేతికి దక్కించని వచ్చిన వార్తలు నిజమయ్యాయి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చరణ్ ఈ సినిమాను నిర్మించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టును కూడా ఆయన చిరంజీవితోనే చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Sye Raa Narasimha Reddy  Prithviraj  Ram Charan  Mohanlal. Lucifer  tollywood  

Other Articles