tollywood celebrities pour in birthday wishes to Megastar టాలీవుడ్ నటవటవృక్షానికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

Tollywood celebrities pour in birthday wishes to megastar

chiranjeevi, Chiranjeevi birthday, syeraa narasimhareddy, devi sri prasad, DSP, devi sri prasad wishes chiranjeevi, dsp birthday wishes to chiru, birthday wishes, Tollywood, Entertainment

Tollywood Celebrities from various department pour in hearty wishes to Megastar Chiranjeevi akka Konidela Siva Sankara Vara Prasad on his Birthday.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. సినీప్రముఖల శుభాకాంక్షలు

Posted: 08/22/2019 01:13 PM IST
Tollywood celebrities pour in birthday wishes to megastar

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి స్థానం ఎంతో ప్రత్యేకమైనది. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. తన అభిమానులను కూడా అదే సంఖ్యలో పెంచుకుంటూ వెళ్లారు. సినీరంగంలోనూ ఆయన అనేక కష్టానష్టాలను అనుభవించాడు, సాధారణ హెడ్ కానిస్టేబుల్ తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన తనకు ఎంతో ఇష్టమైన నృత్యంతోనే ఎదిగారు. ఒకానోక సమయంలో నార్త్ లో మిథున్, సౌత్ లో చిరంజీవి తప్ప డాన్సును ఇరగదీసిన నటులు లేరన్న వార్తలు కూడా పత్రికలలో వచచాయి.

ఇటు తెలుగు చిత్రరంగంలో ఎన్టీఆర్.. ఏఎన్నార్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించారు. తద్వారా తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా చిరంజీవి పేరు తెచ్చుకున్నారు. తన నటనతో తొలుత డైనమిక్ హీరో్ అనిపించుకున్న చిరంజీవి.. ఆ తరువాత సుప్రీంహీరో స్థాయిని అందుకున్నారు. ఇలా కొనసాగుతున్న కాలక్రమంలోనే ఆయనను మెగాస్టార్ ను చేశారు అభిమానులు. ఆయన దశాబ్దకాలం పాటు తమకు దూరంగా వున్నా.. రీ-ఎంట్రీ సాధించగానే ఎంతో మంది అభిమానులను ఆయనలు ఆయనను స్వాగతించారు.

ఆయన జన్మదినం అంటే అభిమానులకు పండగే. ఇంతటి అధరాభిమానాలు సంపాదించుకున్న ఆయన.. అభిమానులు ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే తాను ఎలా సాయం చేయాలనన్న అలోచన నుంచి ఏర్పడినదే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ (నేత్ర)బ్యాంక్. వీటి ద్వారా తన అభిమానులతో పాటు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆయన తనదైన సాయం అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోని అభిమానులు ఇప్పటికీ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని రక్తదాన శిభిరాలు, రోగులకు పండ్లు పంచడం. పేదల బస్తీల్లో అన్నదానం ఇత్యాధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే వున్నారు.

ఇక చిత్రసీమలోనూ మూడింట రెండోంతులకు పైగా మెగాస్టార్ ఫ్యాన్స్ వున్నారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా సీని రంగానికి చెందిన సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఆయనకు సరికొత్తగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు ట్విట్టర్ లో తొలుత చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన అన్నయ్యకు జన్మదిన శుబాకాంక్షలు తెలిపారు. స్ఫూర్తిప్రదాతకు జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కోన్నారు.

ఇక డీఎస్సీ కూడా 'సూపర్ డూపర్ మ్యూజికల్ హ్యాపీ బర్త్‌డే ఒన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య' అంటూ ట్వీట్ చేశాడు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గోపిచంద్, మంచుమనోజ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత నటుడు బండ్ల గణేశ్, హస్యనటుడు వెన్నెల కిషోర్ తదితరలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు నిన్నటితరం నటి రాధిక శరత్ కుమార్, సినీ కస్టూమ్ డిజైనర్ చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల కూడా తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  Chiranjeevi birthday  syeraa narasimhareddy  Ram Charan  Gopi Chand  DSP  Radhika  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh