pawan kalyan wishes Chiranjeevi in a emotional tweet స్పూర్తి ప్రధాతకు జన్మదిన శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్..

Pawan kalyan wishes chiranjeevi in a emotional tweet on his birthday

pawan kalyan emotional tweet on chiranjeevi birthday, chiranjeevi pawan kalyan tweet, chiranjeevi pawan kalyan janasena, pawan kalyan, janasena, megastar Chiranjeevi, megastar Chiranjeevi, Chjranjeevi birthday, chiranjeevi birthday celebrations, Tollywood

JanaSena president and powerstar Pawan Kalyan has conveyed his wishes to Megastar Chiranjeevi on his birthday in an emotional tweet. Powerstar says chiranjeevi is inspiration for many in the state like him, and he is the man with human values.

అన్నయ్య పుట్టినరోజున తమ్ముడి భావోద్వేగ శుభాకాంక్షలు

Posted: 08/22/2019 10:54 AM IST
Pawan kalyan wishes chiranjeevi in a emotional tweet on his birthday

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగష్టు 22) సందర్భంగా.. ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తనతో పాటు రాష్ట్రంలోనే అనేకానేకులకు స్ఫూర్తిప్రదాత నిలిచిన అన్నయ్య చిరంజీవికి ఆయన అభినందనలు తెలిపారు. తన సోదరుడు చిరంజీవి జన్మదినం.. అభిమానులందరికీ పండుగ రోజని పవన్ పేర్కొన్నారు. చిరంజీవి అంటే కేవలం మెగాస్టార్‌ మాత్రమే కాదు, మూర్తీభవించిన స్ఫూర్తి, మానవతా విలువలున్న నిజమైన మనిషని అన్నయ్యపై ప్రశంసలు గుప్పించారు. అబ్దుల్‌ కలాం చెప్పినట్లుగా 'పెద్ద కలలు కనడం, ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడటం' అనే జీవన వేదానికి చిరంజీవి ప్రస్థానం నిదర్శనమని పవన్ వ్యాఖ్యానించారు.

కలలు సాకారమై, శిఖరాలను అధిరోహించిన తర్వాత.. నిగర్వంగా, నిరాడంబరంగా ఉండటం.. తన మూలాలను మరచిపోని స్పృహతో ఉండటం.. లాంటి జీవన విలువలకు చిరంజీవి ప్రతీక అని పవన్ ప్రశంసలు గుప్పించారు. చిరంజీవి.. తానే ఒక సందోహం... తన జీవితమొక సందేశమంటూ కవితాత్మకంగా వర్ణించారు. ఆ సందేశాన్ని అందిపుచ్చుకున్న లక్షల మంది యువతరంలో నేనొక పరమాణువును కావడం అదృష్టం. అంతకుమించి, ఆయన తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరమని పవన్ తెలిపారు.

‘‘అన్నయ్య నరసాపురంలో విద్యార్థిగా ఎన్‌సీసీలో ఉన్ననాటి నుంచి.. మద్రాసులో యాక్టింగ్‌ విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి.. ఇవాళ్టి వరకు అదే ఉక్కు క్రమశిక్షణ. అదే స్థాయిలో అనితర సాధ్యమైన నేర్చుకునే తత్వం. అసామాన్యమైన తన ప్రస్థానంలో ఎన్నెన్ని ఎదురుదెబ్బలు, కుట్రలు, కుతంత్రాలు ఎదురైనా... పట్టుదలతో వాటిని తొక్కేసుకుంటూ.. ఉన్నత శిఖరాలకు ఎగబాకిన ధీరత్వం... చిరంజీవి సొంతం. ఆయన వేసే ప్రతి అడుగు ఆదర్శం, అనుసరణీయం’’ అని అన్నయ్యలోని సుగుణాలను పవన్ ఏకరువు పెట్టారు.

‘‘యావత్‌ భరతజాతి విస్మరించిన అస్తుత సమరాగ్రేసరుడు.. అగణ్య ధీరాగ్రీసరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని... ఆసేతు హిమనగమూ భళీ భళీయని ప్రతిధ్వనించేలాగా... సైరా అంటూ సినీ ప్రియులకు కానుకగా అందిస్తున్న చిరంజీవి గారికి జన్మదినం సందర్భంగా నా తరపున, జనసైనికుల తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పవన్ కల్యాన్ భావోద్వేగం పోస్టును పెట్టారు. ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని అభిలాషించారు.

మెగాస్టార్ చిరంజీవి  జీవితం... మరింత మందికి ఎప్పటికి స్పూర్తిదాయకంగానే ఉండాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కోన్నారు. ఆకాశం ఎప్పటికీ అలా నిశ్చలంగా, నిర్లిప్తంగా ఉంటుంది. కానీ దాని వలన గాలి అష్టదిక్కులకూ విస్తరిస్తుంది. చిరంజీవి గారు మౌనిగా, మునిగా సుస్థిరంగా ఉంటారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ నవతరాలను తీర్చిదిద్దుతూనే ఉంటుంద’’ని అన్నయ్యకు తనదైన శైలిలో పవన్ బర్త్ డే విషెస్ అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Stylish stat allu arjun donate to relief fund to fight agianst coronavirus

  యుద్దానికి సన్నధమైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

  Mar 27 | క‌రోనా వైరస్ పై యుద్దానికి తాను సైతం సన్నధమంటూ సై అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటన నేపథ్యంలో త‌న వంతు బాధ్య‌త‌గా స్టైలిష్ స్టార్ అల్లు... Read more

 • Rrr jr ntr unveils ram charan s stunning first look as birthday treat

  అల్లూరి ఇంట్రోలో మెరిసిన చరణ్.. భీమ్ వాయిస్ ఓవర్ ఫర్ ఫెక్ట్..

  Mar 27 | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. పుట్టినరోజును పురస్కరించుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సర్ ఫ్రైజ్... Read more

 • Darling prabhas donate to pm relief fund to fight agianst coronavirus

  కరోనాపై యుద్దానికి సమరశంఖం పూరించిన డార్లింగ్

  Mar 27 | కరోనా వైరస్‌ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటంలో మేముసైతం అంటూ ముందుకు కదులుతున్నారు సినీప్రముఖులు. ఈ సందర్భంగా నిన్న తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన బాహుబలి సిరీస్ చిత్రాల... Read more

 • Rrr jr ntr surprise video for ram charan delayed by ss rajamouli

  చరణ్ కు ఎన్టీఆర్ సారీ.. అంతా జక్కన్న డైరక్షన్ లోనే..

  Mar 27 | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ ఉదయం పది గంటలకు ఈ చిత్రానికి... Read more

 • Chiranjeevi and mohanbabu conters goes viral on net

  చిరంజీవి-మోహన్ బాబుల చాట్ నెట్టింట్లో వైరల్..

  Mar 26 | మెగాస్టార్ చిరంజీవి.. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన కాంబినేషన్‌. కథానాయకుడిగా చిరంజీవి.. ప్రతినాయకుడిగా మోహన్‌బాబు ఎన్నో చిత్రాల్లో నటించారు. చిరు తనదైన యాక్షన్‌తో ప్రేక్షకులను అలరిస్తే, మోహన్‌బాబు తన మేనరిజమ్స్‌,... Read more

Today on Telugu Wishesh