Maharshi first week box office collections report దుమ్మురేపుతున్న ‘మహర్షి’ తొలివారం కలక్షన్లు..

Mahesh babu s maharshi movie first week worldwide box office collections impressive

Maharshi first week worldwide box office collections, maharshi box office, maharshi first week box office collections, maharshi worldwide collections, Mahesh babu, pooja hedge, allari naresh, vamsi paidipally, 1st week collections, box office collections, movies, entertainment, tollywood

Maharshi has emerged as a big winner at the box office and the film has completed the first week of run in the theatres. The Mahesh Babu movie has now stepped in to the second week of run in almost all the centres that it has released.

దుమ్మురేపుతున్న ‘మహర్షి’ తొలివారం కలక్షన్లు.. అక్కడ డిజాస్టర్

Posted: 05/16/2019 03:46 PM IST
Mahesh babu s maharshi movie first week worldwide box office collections impressive

భారీ బడ్జెట్.. భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మ‌హ‌ర్షి’ సినిమా తొలివారం నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా వెన‌క‌బ‌డినా కూడా ఆంధ్రా తెలంగాణ‌లో మాత్రం దూసుకుపోతుంది. తెలుగు చిత్రపరిశ్రమలో ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి ఈ సినిమాను నిర్మించడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇక దర్శకుడిగా వంశీ పైడిపల్లికి కథ, కథనం సినిమాకు ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. మహేశ్ బాబు డిఫరెంట్ లుక్స్ తో పోస్టర్స్ పై కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

అలా ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను రాబట్టిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటివారంలో ఈ సినిమా 59.37 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తొలివారంలో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 21.67 కోట్ల షేర్ ను సాధించడం విశేషం. అయితే ఇందుకు ఐదు షోలతో పాటు టికెట్ ధర పెంపు కూడా కారణంగా పరిగణిస్తున్నారు విశ్లేషకులు. అయినా ఇది మహేశ్ బాబు కెరియర్లోనే అత్యధిక వసూళ్లని చెబుతున్నారు. మహేశ్ బాబు అభిమానులు కోరుకున్నట్టుగానే ఆయనకి భారీ విజయం దక్కింది.

ఈ చిత్రం సేఫ్ కావాలంటే మ‌రో 30 కోట్లు రావాలి. రెండో వారం కూడా మ‌హ‌ర్షి దూకుడు కొన‌సాగేలా క‌నిపిస్తుంది. ఎందుకంటే ఈ చిత్రానికి పోటీగా ఇప్పుడు మ‌రే సినిమా లేదు. దాంతో క‌చ్చితంగా రెండో వారం కూడా మ‌హేశ్ బాబు ర‌చ్చ చేయ‌డం ఖాయం. అయితే వీక్ డేస్‌లో ఇప్ప‌టికే సినిమా చాలా చోట్ల స్లో అయింది కానీ చెప్పుకోద‌గ్గ వ‌సూళ్లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు ప్ర‌మోష‌న్స్ కూడా భారీగానే చేస్తున్నారు నిర్మాత‌లు. చిత్ర విజయానికి తన వంతు బాధ్యతగా అటు సీఈవోలతో, ఇటు రైతుల‌తో కూడా ముఖాముఖి అవుతున్నాడు మ‌హేశ్ బాబు. అయితే ఓవ‌ర్సీస్‌లో మాత్రం మ‌హ‌ర్షి అనుకున్నంత‌గా ప‌ర్ఫార్మ్ చేయ‌కపోవడంతో డిజాస్ట‌ర్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Naga shourya varudu kaavalenu resumes shooting

  ‘వరుడు కావలెను’ సెట్లోకి అడుగుపెట్టిన నాగశౌర్య

  Jun 24 | యువహీరో నాగశౌర్యకి కొంతకాలంగా సరైన హిట్ లేదనే చెప్పాలి. ఆయన సొంతంగా కథను రూపోందించిన అశ్వధ్దామ చిత్రం.. కథాపరంగా, చిత్రీకరణ అంతా బాగుంది. అయినా కరోనా కష్టకాలం నేపథ్యంలో ఆ చిత్రం ఆశించినంతగా ప్రేక్షకులను... Read more

 • Suresh productions ventures into music industry with sp music

  సురేశ్ ప్రోడక్షన్స్ నుంచి ఎస్.పి మ్యూజిక్ లాంచ్

  Jun 24 | తెలుగు సినిమా రంగంలో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థది ఓ విశిష్టాధ్యాయం. ప్రముఖ నిర్మాత డాక్టర్ డి రామానాయుడు సినీరంగంలో నాటిన మొక్క ఇవాళ ఓ మహావటవృక్షంగా పెరిగి చిత్రసీమలో ఎందరెందరికో జీవితాలను ప్రసాదించింది. తనదైన... Read more

 • Maa elections 2021 megastar backed prakash raj panel announced

  MAA Elections 2021: తన ప్యానెల్ సభ్యులను ప్రకటించిన ప్రకాశ్ రాజ్

  Jun 24 | మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (మా) ఎన్నికలు  ఉత్కంఠభరితంగా మారాయి. సెప్టెంబర్‌లో జరగాల్సిన ఎన్నికలకు 3 నెలల ముందే వాతావరణం వేడెక్కింది. అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌, హీరో మంచు... Read more

 • Maa elections prakash raj in race for president post gets nagababu support

  ‘మా’ బరిలో ప్రకాశ్ రాజ్.. మోగా వర్సెస్ మంచు మధ్య వార్

  Jun 22 | తెలుగు చిత్రపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ”ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌.. ఈసారి అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగగా.. మంచు విష్ణు మరో ప్యానెల్... Read more

 • Mega powerstar ram charan bags another record on instagram

  మెగా పవర్ స్టార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు

  Jun 22 | మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్ట్రాగ్రామ్ లో 4 మిలియన్స్‌(40 లక్షలు) ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. సౌత్‌ నుంచి నాలుగు... Read more

Today on Telugu Wishesh