Steady Collections For Chitralahari సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ మూడవరోజు కలెక్షన్స్..

Chitralahari 3rd day box office collections report

Sai Dharam Tej, Chitalahari, Nivetha Pethuraj, Kalyani Priyadarshi, Sunil, Devi Sri Prasad, Tollywood,Box Office Collections,chitalahari movie,chitalahari collections,chitalahari 3rd day collections, movies, entertainment, tollywood

Mega Supreme hero Sai Dharam Tej, Kalyani Priyadarshan and Nivetha Pethuraj played the lead roles in the film Chitralahari. The film released in a grand manner and opened to a positive response from even at box office collections.

సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ మూడవరోజు కలెక్షన్స్..

Posted: 04/15/2019 11:03 PM IST
Chitralahari 3rd day box office collections report

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇంతకుముందు చేసిన ప్రేమకథా చిత్రాలలో కొన్ని .. థియేటర్లలో మంచి సందడి చేశాయి. ఆ కోవలోకి చెందినదిగానే ఆయన తాజా చిత్రం 'చిత్రలహరి' కనిపిస్తోంది. ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల నుంచి మనన్నలు అందుకుంటోంది.

ఈ సినిమాలో తేజు సరసన నాయికలుగా కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ నటించారు. విడుదలైన తొలిరోజున 4.18 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం.. వీకెండ్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 7.95 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 9.50 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 13 కోట్లకే అమ్మడం జరిగింది.

అందువలన తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటుతుందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా అమెరికాలోను ఈ సినిమా జోరుమీద ఉంటే బాగుండేదనేది అభిమానుల మాట. తాజాగా ఈ సినిమాపై చిరంజీవి తన స్పందనను తెలియజేశారు. తాను చిత్రలహరి చిత్రాన్ని వీక్షించానని, చిత్రం చాలా బాగుందని, అందరూ వెళ్లి చూడాల్సిందిగా ఆయన తన అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలకు విన్నవించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Tej  Chitalahari  Nivetha Pethuraj  Kalyani Priyadarshi  Sunil  tollywood  

Other Articles

Today on Telugu Wishesh