Aravinda Sametha rules box office రూ. వంద కోట్ల షేర్ రాబట్టిన ‘అరవింద సమేత’

Aravinda sametha veera raghava record box office collections

trivikram srinivas, junior ntr, aravinda sametha, rs 100 cr share, record collections, Tollywood Box Office Collections 2018, movies, entertainment, tollywood

Aravinda Sametha continues its success journey even on the 18th day of its release. The total Box Office collection of the movie has reached Rs 165 crores.

అధికారికం: రూ. వంద కోట్ల షేర్ రాబట్టిన ‘అరవింద సమేత’

Posted: 10/30/2018 06:58 PM IST
Aravinda sametha veera raghava record box office collections

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ' కేవలం 18 రోజుల వ్యవధితోనే రికార్డును సృష్టించింది. దసరా పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఓపెనింగ్స్ విషయంలోనే రికార్డులు సృష్టించిన ఈ సినిమా, ఇంకా తన దూకుడు చూపుతూనే వుంది.

18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 165 కోట్ల గ్రాస్ ను సాధించడం ఒక ఘనతే కాగా దీనికి తోడు అదే పద్దెనిమిది రోజుల్లో రూ. 100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసింది. ఎన్టీఆర్ కెరియర్లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. ఇలా ఒక అరుదైన రికార్డును ఎన్టీఆర్ ఖాతాలో ఈ సినిమా నమోదు చేసి పెట్టింది. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అంటూ వస్తే అది బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని భావించిన అభిమానుల అంచనాలను నిజం చేస్తూ.. చిత్రం భారీ విజయం సాధించడంతో నందమూరి అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles