Aravindha Sametha Two Days Collections బాక్సాఫీసు వద్ద పంబ రేపుతున్న అరవింద సమేత

Aravindha sametha veera raghava two days box office collections

NTR, Aravindha Sametha Veera Raghava, Trivikram, Pooja Hegde, Haarika and Hassine Creations, SS Thaman, Aravindha Sametha Veera Raghava news, Aravindha Sametha Veera Raghava updates, Aravindha Sametha Veera Raghava collections, Aravindha Sametha Veera Raghava reviews, movies, entertainment, tollywood

Aravindha Sametha Veera Raghava Two Days Collections: NTR's Aravindha Sametha Veera Raghava collected a theatrical share of Rs 34.60 crores in two days of its box-office run.

బాక్సాఫీసు వద్ద పంబ రేపుతున్న అరవింద సమేత

Posted: 10/13/2018 06:32 PM IST
Aravindha sametha veera raghava two days box office collections

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. తొలిరోజే టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్స్‌ను బద్దలుకొట్టింది. ఎన్టీఆర్ కెరియర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ తో పాటు 2018లో బెగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 60 కోట్ల గ్రాస్ సాధించడమే కాకుండా ఓవర్సీస్‌లో తొలిరోజు మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరి రికార్డుల సునామి సృష్టించింది.

ఇక ఆస్ట్రేలియాలోనూ అరవింద సమేత కాసుల వర్షం కురిపిస్తుంది. గురువారం నాడు A$ 128,740 డాలర్లు, శుక్రవారం నాడు A$ 69,666 డాలర్లతో మొత్తంగా 37 లొకేషన్లలో A$ 198,406 డాలర్లు (1. 04 కోట్లు) వసూలు చేసినట్టు మూవీ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అయితే ఈ చిత్రాన్ని గతంలో విడుదలైన మిర్చి, సింహాద్రి చిత్రాలతో పోలుస్తూ.. పెదవి విరుపులు కనిపిస్తున్నప్పటికీ ఆ ప్రభావం కలెక్షన్స్‌పై పడలేదు. ఓవర్సీస్‌తో పాటు ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో రెండోరోజు కలెక్షన్లు ఊపందుకున్నాయి.

రెండో రోజు నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.59 కోట్ల షేర్‌ను రాబట్టి పాత రికార్డులను చెరిపేసింది. దీంతో ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో రెండో రోజు నాటికి 34. 59 కోట్ల వసూలు చేసిన చిత్రంగా నిలిచింది అరవింద సమేత. ఇక శని, ఆదివారాలు కలిసి రావడం, పైగా దసరా పండుగకు సింగల్‌గా వచ్చిన ఈ మూవీకి పోటీగా పెద్ద సినిమాలు ఏవీ బరిలో లేకపోవడం కలెక్షన్ల కుమ్ముడు ఖాయంగానే కనిపిస్తుంది. 

ఏపీ, తెలంగాణలో కలెక్షన్ల వివరాలు..

నైజాం ... 8.55 కోట్లు
సీడెడ్ ... 7. 44 కోట్లు
నెల్లూరు .. 1. 33 కోట్లు
క్రిష్ణా ... 2. 51 కోట్లు
గుంటూరు .. 4.82 కోట్లు
వైజాగ్ .. 4. 01 కోట్లు
ఈస్ట్ గోదావరి .. 3. 24 కోట్లు
వెస్ట్ గోదావారి .. 2. 69 కోట్లు


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Aravindha Sametha Veera Raghava  Trivikram  box office collections  tollywood  

Other Articles