బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ హీరోలుగా నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమా ట్రైలర్ దుమ్మురేపుతుంది. ఇవాళ రిలీజ్ అయిన ఈ ట్రైలర్ లో అటు బిగ్ బి అమితాబ్, ఇటు అమీర్ ఖాన్ లిద్దరూ హుషారుగా కనబడుతున్నారు. కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మూడు నిమిషాల 36 సెకెన్ల ట్రైలర్ ను సినీ నిర్మాణ వర్గాలు ఇవాళ విడుదల చేశాయి.
భారత దేశ స్వాతంత్ర్యసమరానికి పూర్వానికి సంబంధించిన ఈ చిత్రంలో అమితాబ్, అమీర్ కస్టూమ్స్, గెటప్స్ అకర్షణీయంగా వున్నాయి. మోసం చేయడం నా స్వభావం అని అమితాబ్ తో ఆమిర్ అంటాడు. ఇందుకు అమితాబ్.. నమ్మకం నా స్వభావం అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎవరు చేయని ప్రయోగాన్ని విజయ్ కృష్ణ ఆచార్య చేస్తున్నారు. యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాను రూపొందిస్తున్నది.
ఇందులో అమితాబ్ బందిపోటు దొంగగా నటిస్తున్నాడు. అమితాబ్, ఫాతిమా క్యారెక్టర్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ మూవీలో అమీర్ ఖాన్ ఫిరంగి ముల్లాహ్ అనే క్యారెక్టర్ లో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు. ట్రైలర్ విజువల్ వండర్ గా రూపొందింది. స్వాతంత్య్రానికి పూర్వం బందిపోట్లకు, బ్రిటిష్ సైనికులకు మధ్య జరిగే పోరాటమే ఈ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్. ఆ వయసులో కూడా అమితాబ్ ఎంతో చక్కగా నటించారు. హిందీతో పాటు ఈ మూవీ తెలుగు, తమిళ భాషలలో దీపావళి కానుకగా నవంబర్ 8న రిలీజ్ కానుంది.
(And get your daily news straight to your inbox)
May 21 | యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. మే6న విడుదలైన ... Read more
May 21 | తన పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులను కలవలేకపోయినందకు వారికి క్షమాపణలు చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సమయంలో ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని..క్షమించాలని కోరారు. ఈ మేరకు తాజాగా... Read more
May 21 | రామ్ హీరోగా లింగుసామి 'ది వారియర్' సినిమాను రూపొందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో రామ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన... Read more
May 21 | తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో... Read more
May 21 | పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో నడిచే ఈ కథలో పవన్ సరసన నాయికగా... Read more