Jaaved Jaaferi deletes the tweet on donation గోబెల్స్ ప్రచారం చేయబోయి పరువు తీశాడు..

Jaaved jaaferi deletes the tweet on salman khan s donation

Entertainment News, Bollywood News, Hindi Movies News, tweet, salman khan, Kerala flood, Jaaved Jaaferi, donation, B-Town, movies, entertainment, tollywood

Bollywood actor Javed Jaaferi of late took to twitter to appreciate Salman Khan's support towards the relief fund. However, he deleted the tweet sighting some inaccuracy of details.

గోబెల్స్ ప్రచారం చేయబోయి పరువు తీశాడు..

Posted: 08/27/2018 04:20 PM IST
Jaaved jaaferi deletes the tweet on salman khan s donation

భారీ వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకోవడానికి ఎంతో మంది ముందుకొస్తున్నారు. వారిలో ఎందరో బాలీవుడ్ ప్రముఖులు కూడా వున్నారు. ఈ క్రమంలో తాజాగా నటుడు జావేద్ జాఫ్రీ తన ట్విట్టర్ ను అందుకుని పోస్టు చేసిన ఓ వార్త నెట్ జనుల విమర్శలను అందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన సదరు ట్వీట్ ను తొలగించారు. తనకు సరైన సమగ్ర సమాచారం అందిన తరువాత మళ్లీ ట్వీట్ చేస్తానని కామెంటును పెడుతూ అంతకుముందు చేసిన ట్వీట్ ను డిలీట్ చేశారు.

ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏంటీ.. అనేగా.. అక్కడికే వస్తున్నాం. కేరళ వరద బీభత్సం నేపథ్యంలో తమ హీరో, బాలీవుడ్ స్టార్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఏకంగా రూ. 12 కోట్లు విరాళం ప్రకటించాడని ఈ సమాచారం తాను విన్నానని ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ సాగిందిలా.. 'కేరళ కోసం సల్మాన్ రూ. 12 కోట్లు ప్రకటించినట్టు విన్నా. సల్లూకు ప్రజల ఆశీస్సులు ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్' అంటూ జావెద్ ట్వీట్ చేశాడు.

అయితే, ఈ వార్త నిజం కాదంటూ నెటిజన్లు వరుసగా ట్వీట్లు చేయడం ప్రారంభించారు. అయితే ఒక నటుడిగా మీ అభిమాన తారకు గొబెల్స్ ప్రచారాన్ని అందించేందుకు చేసిన కృషి అభినందనీయమని కూడా నెట్ జనులు ట్వీట్ చేశారు. మీ అభిమానాన్ని పెంచుకునేందుకు మరోన్నో జిమ్మిక్కులు వున్నాయి.. వాటి ద్వారా ప్రయత్నాలు చేయండీ అంతేకాని అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితుల కష్టాలపై ట్వీట్లు చేసి అభిమాన హీరో పరువును పోగొట్టకండీ అంటూ కూడా నెట్ జనులు వాతలు పెట్టారు.

దీంతో ఆయన దీనికి సమాధానంగా, 'సల్మాన్ లాంటి సూపర్ స్టార్ కు అంత మొత్తం విరాళం ఇచ్చేంత స్థాయి ఉంది. సల్మాన్ విరాళం ప్రకటించాడని నేను చెప్పలేదు. ఆ వార్తలు విన్నానని మాత్రమే చెప్పా. ఈ విషయాన్ని నేను నిర్ధారించుకునేంత వరకు నా ట్వీట్ ను వెనక్కి తీసుకుంటున్నా' అంటూ మరో ట్వీట్ చేశాడు. అయితే ఒక నటుడిగా మీ అభిమాన తారకు గొబెల్స్ ప్రచారాన్ని అందించేందుకు చేసిన కృషి అభినందనీయమని కూడా నెట్ జనులు ట్వీట్ చేశారు. దీంతో ఆయన

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  Kerala flood  Jaaved Jaaferi  tweet  donation  bollywood  

Other Articles