Suriya donates Rs 1 Cr for Tamil Farmers నిండు ఆకాశమంత మనస్సు వున్న రాజువయ్యా..

Suriya shows that he is a man with golden heart

Kadaikutty Singam, Karthi, Suriya, Kadaikutty Singam success meet, Suriya news, Suriya updates, Suriya latest, Suriya charity, Suriya foundation, Agaram Foundation, chinababu, kollywood, movies, entertainment

Suriya donates Rs 1 Cr for Tamil Farmers: Suriya announced a charity of Rs 1 crore for Tamil Nadu farmers through his Agaram Foundation.

నిండు ఆకాశమంత మనస్సు వున్న రాజువయ్యా..

Posted: 07/24/2018 08:01 PM IST
Suriya shows that he is a man with golden heart

తమిళ యువ హీరోల మధ్య చక్కని పోటీ నెలకొంది. వీరి పోటీ సినిమాలు తీయడంలోనో.. లేక కలెక్షన్ల వర్షం కురిపించడంలోనో లేక అత్యధిక పారితోషకం పొందడంలోనో కాదు. మరెందులో వారు పోటీ పడతారు అంటే.. సమాజానికి సేవ చేయడంలో.. తమ వంతుగా ఏం చేస్తున్నామా.. అన్న అంశంలో మాత్రం తమిళ హీరోలు, నటుల మధ్య సహృద్భావ పోటీ నెలకొని వుంది. తుత్తుకూడి ఘటన తరువాత ఎవరికీ అనుమానం రాకుండా బైక్ పె వెళ్లి మరీ బాధిత కుటుంబాలను పరామర్శించిన నటుడు విజయ్ ఔదార్యాన్ని మనం చూశాం.

ఇక హీరో విశాల్ రైతుల కోసం ప్రతీ తమిళ సినిమా టిక్కెట్ లోంచి ఒక్క రూపాయిని విరాళంగా ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక లారెన్స్ రాఘవ కూడా బాల హృద్రోగులకు సర్జరీలకయ్యే ఖర్చును భరిస్తూ తన వంతు సమాజాసేవ చేస్తున్నాడు. అగ్రహీరోల జాబితాలో ఒకరైన సూర్య కూడా సమాజం పట్ల ఎంతో భాద్యతగా వ్యవహరిస్తూ ఉంటారు.  ఇప్పటికే అగరం ఫౌండేషన్ స్థాపించి వేలాది మంది పేద పిలల్లకు ఉచితంగా విద్యను భోదిస్తూ ఇంకెందరికో స్కాలర్ షిప్స్ అందజేస్తున్నాడు సూర్య.

తమిళనాట ఎలాంటి విపత్తులు సంభవించినా వెంటనే  స్పందించి తన వంతు సహాయం చేస్తున్న ఈ నటుడు.. తాజాగా తమిళనాడులోని రైతుల కోసం కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు.  ఈ మొత్తాన్ని తన అగరం ఫౌండేషన్ ద్వారా రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయనున్నారు.  ఈమధ్యే ఆయన తన సోదరుడు కార్తి హీరోగా రైతుల నేపథ్యంలో 'చినబాబు' అనే సినిమాను కూడ నిర్మించారు.  ఆ సినిమా సక్సెస్ వేడుకల్లోనే ఈ విరాళాన్ని ప్రకటించారు సూర్య.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kadaikutty Singam  Suriya  Karthi  chinababu  kollywood  

Other Articles