Chatrapathi Villain Actor Narendra Jha Passes Away | ఛత్రపతి విలన్ నటుడు కన్నుమూత

Actor narendra jha passes away

Narendra Jha, Chhatrapati Villain, Passes Away, Actor Narendra Jha Dies, Narendra Jha News, Bollywood Actor Narendra Jha

Well-known actor, Chhatrapati Fame Narendra Jha is no more. The actor aged 55 passed away due to a heart attack. He breathed his last at his farm house in Wada early morning today. He was at the farm house with his family and friends when this tragedy occurred.

ఛత్రపతి ఫేమ్ నరేంద్ర ఝా కన్నుమూత

Posted: 03/14/2018 12:06 PM IST
Actor narendra jha passes away

బాలీవుడ్ నటుడు, ఛత్రపతి ఫేమ్ నరేంద్ర ఝా (55) కన్నుమూశారు. బుధవారం గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు. మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించిన నరేంద్ర తర్వాత.. టెలివిజన్‌ స్టార్ గా బిజీ అయిపోయారు. ఆపై వెండితెరపై అవకాశాలు దక్కటంతో స్టార్‌ హీరోల చిత్రాల్లో నటించి మెప్పించారు.

2002లో ఫంటూష్‌ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం హైదర్‌, రయిస్‌, మొహంజోదారో, కాబిల్ లాంటి చిత్రాల్లో ఆయన నటించారు. ఇక టాలీవుడ్ లో ఛత్రపతిలో బాజీరావ్ గా గాంభీర్యమైన విలన్ పాత్రతో మెప్పించారు. ఆపై యమ దొంగ, లెజెండ్ చిత్రాల్లోనూ ఆయన నటించి మంచి గుర్తింపు పొందారు. తమిళ్ లో అజిత్ వీరమ్(వీరుడొక్కడే) చిత్రంలోనూ నటించారు. 

కాగా సల్మాన్‌ఖాన్‌ హీరోగా బాలీవుడ్‌ అప్‌ కమింగ్‌ మూవీ రేస్‌-3 నరేంద్ర ఆఖరి చిత్రం. నరేంద్ర హఠాన్మరణంపై ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Jha  Passes Away  నరేంద్ర ఝా  కన్నుమూత  

Other Articles