Nag Nani Multi Starrer Beging from Ugadi | మల్టీస్టారర్.. మ్యూజిక్ సిట్టింగ్స్ అక్కడేనంట!

Nag nani regular shoot date announced

Nagarjuna Akkineni, Nani, Multi Starrer, Ugadi, Producer Aswani Dutt, Mani Sharma

Nagarjuna Nani Multi Starrer Regular Shooting Begins from Ugadi. Aswani Dutt Released a Press Note that Mani Sharma Composed Music and Music Sittings continues in America.

నాగ్-నాని.. రెగ్యులర్ షూటింగ్ డేట్ కుదిరింది

Posted: 03/12/2018 03:40 PM IST
Nag nani regular shoot date announced

టాలీవుడ్ ప్రేక్షకుల్లో మరో చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా నాగార్జున-నాని మల్టీస్టారర్ చిత్రం షూటింగ్ లాంఛ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందని ఎదురు చూస్తున్నారు.

దీంతో నిర్మాత అశ్వనీదత్ ఓ ప్రకటన విడుదల చేశారు. " 'ఉగాది' రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి" అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం మణిశర్మతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ అమెరికాలో వేయబోతున్నారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య .. పాత్రలను మలిచితీరు అద్భుతంగా ఉంటుంది. గతంలో మా బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్ అనిపించుకున్నాయి. అలాగే మణిశర్మ అందిస్తోన్న బాణీలు కూడా అందరి మనసులను దోచుకుంటాయి. నాగార్జున .. నాని కాంబినేషన్లో చేస్తోన్న ఈ సినిమా, మా బ్యానర్ కి మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకముంది" అంటూ అశ్వనీదత్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

కాగా, నాగ్ ఈ చిత్రంలో డాన్ పాత్రలో కనిపించబోతుండగా.. డాక్టర్ పాత్రలో నాని నటించబోతున్నాడు. నాని కోసం నాగ్ చేసే సాయం నేపథ్యంలో చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. హిల్లేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా శ్రీరామ్ దీనిని తెరకెక్కించబోతున్నాడన్నది టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles