Huge Demand for Kaala Dog | కాలా కుక్కకి భలే గిరాకీ.. ఎంత తెలిస్తే షాకవుతారు

Kaala dog mani is 2 crores worth now

Kaala, Dog, Mani, Rajinikanth Dog, Animal Trainer Simon, Kaala Mani Trainer, Kaala Dog Story, Kollywood News

Remember the dog in the Kaala poster, which majestically sits next to Superstar? There is now a heavy demand for that canine. Animal trainer Simon, who has worked in hundreds of films, in an interview with Behindwoods, revealed that the dog named Mani has become a hero overnight. Seen the dog in Kaala poster.. Fans want to shell out Rs 2 crore for it.

కాలా కుక్కకు భలే డిమాండ్

Posted: 03/08/2018 12:42 PM IST
Kaala dog mani is 2 crores worth now

సౌత్ సూపర్ స్టార్ తో నటించే వాళ్లకు మాత్రమే కాదు.. ఆయన వాడే వస్తువులను కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అప్పట్లో కాలా పోస్టర్ కోసం ఆయన వాడిన వాహనాన్ని కొనుగోలు చేసేందుకు ఓ ప్రముఖ కంపెనీ ముందుకు వచ్చింది. ఇప్పుడు కాలాలో రజనీ పక్కన కనిపించినందుకు మణికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది.

కాలా' సినిమాలో టైటిల్ కి తగినట్టుగానే రజనీకాంత్ పవర్ఫుల్ డాన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన పెంపుడు జంతువుగా 'మణి' అనే ఓ కుక్క నటించింది. పోస్టర్స్ లోను ఈ కుక్కను హైలైట్ చేశారు. దాంతో ఇప్పుడు ఈ కుక్కకి క్రేజ్ పెరిగిపోయింది .. దాని దశ తిరిగిపోయింది. రజనీకాంత్ తో కలిసి నటించడం వలన ఈ కుక్కకి భారీస్థాయిలో డిమాండ్ పెరిగిపోయింది. దాంతో దానిని దక్కించుకోవడానికి మలేషియన్ రజనీ ఫ్యాన్స్ పోటీపడుతున్నారని ట్రైనర్ 'సిమన్' చెబుతున్నాడు. సినిమాలకి అవసరమైనప్పుడు ఆయన కావలసిన కుక్కలను తీసుకొచ్చి.. వాటితో నటింపజేస్తుంటాడు.

"చెన్నైలోని ఓ రోడ్ పైన 'మణి' దొరికింది . . మణికి ఇప్పుడు రెండేళ్లు. సుమారు 30 కుక్కలను పరిశీలించిన తరువాత దర్శకుడు రంజిత్ ఈ కుక్కను ఓకే చేశాడు. రజనీ సార్ కి ఈ కుక్క అంటే చాలా ఇష్టం .. షూటింగ్ జరిగినన్నినాళ్లు ఆయన దానిని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. దాని కోసం ప్రత్యేకమైన బిస్కట్లు తెచ్చేవారు. ఇప్పుడు ఈ కుక్కను కొనడానికి 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకూ ఇస్తామంటూ ఆఫర్లు వస్తున్నాయి. కానీ నేను దీనిని అమ్మదలచుకోలేదు .. ఎందుకంటే నేను దీన్ని ఓ బిడ్డలా చూసుకుంటున్నాను" అని సిమన్స్ వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kaala  Rajinikanth  Dog Mani  కాలా  రజనీకాంత్  మణి  

Other Articles