Tollywood Director Sensation Tweet On PM Modi | మోదీపై కొరటాల శివ సంచలన ట్వీట్

Director koratala tweet on pm modi

Koratala Siva, PM Narendra Modi, Sensational Tweet, Tollywood Director, AP Special Status

Tollywood Top Director Koratala Siva Sensation Tweet on PM Narendra Modi. Koratala Slams in tweet that Modi not treat teleugu states in Part of India.

ప్రధాని మోదీపై కొరటాల సంచలన ట్వీట్

Posted: 03/08/2018 11:04 AM IST
Director koratala tweet on pm modi

టాలీవుడ్ అగ్ర దర్శకుడు కొరటాల శివ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రం వైఖరిని తప్పుబడుతూ తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఓ పోస్టును పెట్టారు. డైరెక్టుగా ప్రధాని టార్గెట్ చేసుకునే ట్వీట్ చేశారు.

"ప్రధాని నరేంద్ర మోదీని మనిషిగా మారుద్దాం. తెలుగు రాష్ట్రాలు భారత్‌లో అంతర్భాగం అని మీరు నిజాయితీగా భావిస్తున్నారా సార్?" అంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలను మనమంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తుచేద్దామంటూ ఆయన తెలిపారు.

కాగా, రెండు రోజుల క్రితం తన కొత్త చిత్రం ‘భరత్ అను నేను’ టీజర్‌ లో పాప్యులర్ అయిన ఓ డైలాగ్‌ ను కొరాటాల శివ తన సోషల్ మీడియాలో మోదీకి అన్వయించడం గమనార్హం. కొరటాల చేసిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Koratala Tweet On Modi

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles