One More Strong Point in Ram Charan Rangasthalam | రంగస్థలంలో లవ్ తోపాటు మరో స్ట్రాంగ్ పాయింట్

Rangasthalam movie key point

Rangasthalam, RC11, Ram Charan, Director Sukumar, Village Politics, Love Story, Samantha Akkineni

Beside Love Story Rangasthalam has one more strong point. Ram Charan and Samantha Love Story,, Village Politics also plays key role in Sukumar Rangasthalam.

రంగస్థలంలో ప్రేమతోపాటు మరో పాయింట్

Posted: 02/16/2018 04:51 PM IST
Rangasthalam movie key point

కంప్లీట్ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో టాలీవుడ్ లో చాలా అరుదుగానే సినిమాలు వస్తున్నాయి. అయితే స్టార్ హీరోల తరపున అవి చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో రంగస్థలం గ్రామం.. అందులో చిట్టిబాబు, రామలక్ష్మి, తదితరులు చేయబోయే సందడి కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టరులు, టీజర్లు పల్లె అందాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇక సుకుమార్ కథల్లో బలం కూడా ఎక్కువగానే ఉంటుందన్నది తెలిసిందే. ఈ క్రమంలో 'రంగస్థలం' సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. గోదావరిలో పడవ నడిపే చిట్టిబాబుగా చరణ్ నటిస్తుండగా, రామలక్ష్మి అనే పేదింటి పిల్లగా సమంత నటిస్తోంది. ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం .. దాని పర్యవసానాలు... వాటికి అదనంగా మరో హర్డ్ పాయింట్ తో సినిమా ఉండబోతుందని సమాచారం.

అదే గ్రామీణ రాజకీయాల నేపథ్యం. 1985 నాటి రాజకీయాలు .. అవి చూపే ప్రభావాలు కథలో భాగంగా వస్తాయని అంటున్నారు. ఎన్నికలకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా ఉత్కంఠను రేపేవిగా వుంటాయని చెబుతున్నారు. మరి అవి ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే మార్చి 30 దాకా ఎదురు చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangasthalam  Ram Charan  రంగస్థలం  రామ్ చరణ్  

Other Articles