Prevent Nara Dishti Farmers Used Sunny Leone Photos | నర దృష్టికి విరుగుడు.. శృంగార తార సెమీ న్యూడ్ ఫోటోలు

Sunny leone photos in agricultural lands

Sunny Leone, Agricultural Land, Andhra Pradesh, Nellore Farmers Sunny Leone, Sunny Leone Photos, Sunny Semi Nude Photos in Farming Lands, Sunny Leone Photos Nara Dishti, AP Farmers

To Prevent from Nara Dishti Nellore Farmers Used Sunny Leone Photos. Farmers Arranged Sunny Leone Semi Nude Photos for Diverting People from Agricultural Land.

పొలాల్లో సన్నీ ఫోటోలు.. నర దిష్టి కోసమేనంట!

Posted: 02/12/2018 04:01 PM IST
Sunny leone photos in agricultural lands

శృంగార తార సన్నీ లియోన్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పోర్న్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ ఇండో కెనెడియన్ కు ఇక్కడ చాలా పాపులారిటీ ఉంది. అలాంటి సన్నీని ఇక్కడ కొందరు రైతులు మాత్రం మరోలా వాడుకుంటున్నారు.
నరదిష్టి నుంచి తమ పంటలను కాపాడుకోవడానికి సన్నీ ఫోటలను ఏర్పాటు చేస్తున్నారు .

సన్నీ ఫొటోల ద్వారా దారినపోయే వారి దృష్టిని అటువైపు మరల్చారు. ఇది జరిగింది ఎక్కడో కాదు.. మన తెలుగు రాష్ట్రంలోనే... శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా దుత్తలూరు మండలం బండకిందపల్లి, బ్రహ్మేశ్వరం గ్రామాల రైతులు బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి పంటలను సాగుచేస్తున్నారు. మొక్కలు పచ్చగా ఎదిగి ఆకర్షణీయంగా ఉండడంతో దారిన పోయే వారు అటువైపు చూడకుండా ఉండలేకపోతున్నారు.

బాటసారుల దృష్టి మొత్తం తమ పంటలపైనే ఉండడంతో దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందిన రైతులు.. వారి దృష్టిని పంటల మీది నుంచి మళ్లించేందుకు పొలం గట్లపై పై సన్నీలియోన్ అర్ధనగ్న బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడితో ఆగిపోలేదు.. ‘ఒరేయ్, నన్ను చూసి ఏడవకురా’ అని కింద స్లోగన్ కూడా రాయించారు. ఇప్పుడీ బ్యానర్లు హాట్ టాపిక్ అయ్యాయి. మిగతా రైతులు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles