Vishal Confirms his marriage in Nadigar Sangam Building | పెళ్లి వేదికను కన్ఫర్మ్ చేసేసిన విశాల్

Vishal on his marriage

Actor Vishal, Nadigar Sangam, Vishal Wedding, Nadigar Sangam Building, Vishal on Nadigar Sangam Building, Vishal on Marriage

Actor Vishal Confirmed his wedding in Nadigar Sangam Building. By 2019 Sankranti Building Completes and his wedding firstly take part.

పెళ్లి వార్తలపై విశాల్ స్పందన

Posted: 02/10/2018 05:25 PM IST
Vishal on his marriage

ప్రముఖ నటుడు విశాల్‌ పెళ్లి విషయం మరోసారి వార్తల్లో నిలిచింది. నడిగర్ (దక్షిణ భారత నటీనటుల) సంఘ భవనంలో తొలి పెళ్లి తనదేనంటూ మరోసారి విశాల్ స్పష్టత ఇచ్చాడు. చెన్నై విమానాశ్రయంలో విశాల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని అన్నాడు.

డిసెంబర్ నాటికి ఈ భవన నిర్మాణం పూర్తవుతుందని, జనవరిలో ప్రారంభోత్సవం ఉంటుందని ప్రకటించాడు. పనిలో పనిగా ఆ భవనంలోని కల్యాణ మండపంలో జరిగే తొలి పెళ్లి తనదేనని తెలిపాడు. ఈ మేరకు అడ్వాన్స్ ఇచ్చి మండపాన్ని బుక్ చేసుకున్నానని తెలిపాడు. అయితే వధువు ఎవరు? అన్నది మాత్రం సీక్రెట్ గా ఉంచాడు. కాగా, శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో విశాల్ ప్రేమలో ఉన్నాడంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక రౌడీల బర్త్ డే పార్టీ గురించి మాట్లాడుతూ, సినిమాల్లో అలాంటి సన్నివేశాలు సహజమని, కానీ వాస్తవంలో జరిగిందని తెలిసి ఆశ్చర్యపోయానని విశాల్ చెప్పాడు. చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న క్యూబ్, జీఎస్టీ వంటి సమస్యలపై సంఘటితంగా పోరాడాలని ఇచ్చిన పిలుపుకు కట్టుబడి ఉన్నామని విశాల్ తెలిపాడు. ఈ మేరకు మార్చి 1 నుంచి సమ్మె జరుగుతుందని స్పష్టం చేశాడు. ఆరోజు నుంచి సినిమాల విడుదల ఉండదని అన్నాడు. క్యూబ్ సంస్థలతో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, అవి సఫలమవుతాయని ఆశిస్తున్నట్టు విశాల్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles