Styish Star Shoot in Extreme Conditions for Next | సైనికుడిగా గడ్డ కట్టే చలిలో బన్నీ రియల్ సాహసాలు

Na peru surya kashmir shoot updates

Stylish Star Allu Arjun is essaying the role of a soldier in his next film titled Na Peru Surya. The film also has a strong social message and has been laced with all the needed commercial elements. Now the team of Na Peru Surya headed to Kasmhir to shoot for some crucial episodes for the film. The actor along with his team is shooting at -12 degrees cold. The schedule will last for a week after which the team will return back to Hyderabad.

గడ్డ కట్టే చలిలో బన్నీ సాహసాలు

Posted: 02/05/2018 03:46 PM IST
Na peru surya kashmir shoot updates

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాల కోసం పడే కష్టం అంతా ఇంతా ఉండదు. దేశ ముదురు టైంలో సిక్స్ ప్యాక్ కోసం పడ్డ కష్టం మొదలు ఇప్పుడు నా పేరు సూర్య కోసం కూడా అదే సీన్ కనిపిస్తోంది.

ఓ ఆర్మీ అధికారి పాత్ర కోసం బన్నీ చేస్తున్న పనేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పటికే వెయిట్ లిఫ్ట్ లు, ఫైట్లు చేస్తున్న ఆ అల్లు హీరో ఇప్పుడు గడ్డ కట్టే మంచులో షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం నా పరు సూర్య టీం మొత్తం 12 మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలోని లోకేషన్లలో షూటింగ్ జరుపుకుంటోంది. డార్జిలింగ్ లో షూట్ కు అనుమతి నిరాకరించటంతో వారు కశ్మీర్ లో షూటింగ్ నిర్వహించుకుంటున్నారు. అక్కడే వారంపాటు షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.

అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు అర్జున్, రావు రమేష్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లగడపాటి శ్రీధర్, నాగబాబు, బన్నీ వాసు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్నారు. సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles