Actress File Case against spiritual TV Channel | పరువు తీశాడు.. ఆ ఛానెల్ సంగతి తేల్చండి.. పోలీసులకు నటి కళ్యాణి ఫిర్యాదు

Actress karate kalyani file case

Kalyani Padala, Karate Kalyani, Ramanananda Maharshi, Shiva Shakthi Sai TV, Shiva Shakthi Sai TV Karate Kalyani, Shiva Shakthi Sai TV Actress Complaint, Actress Kalyani Police Complaint

Actress Kalyani Padala alias Karate Kalyani on Thursday lodged a complaint with the Central Crime Station (CCS) police alleging a TV channel, owned by Ramanananda Maharshi,

ఆధ్యాత్మిక ఛానెల్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు

Posted: 02/02/2018 11:57 AM IST
Actress karate kalyani file case

సినీ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి పోలీసులను ఆశ్రయించారు. ఛత్రపతి, మిరపకాయ్, కృష్ణ తదితర చిత్రాలతో నటి కళ్యాణి పాపులర్ అయిన విషయం తెలిసిందే. తనపై అసభ్య కథనాలతో పరువు మొత్తం తీసేశారంటూ ఓ ఆధ్యాత్మిక ఛానెల్ పై ఆమె ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఆమె పిర్యాదు చేశారు. 

విషయంలోకి వెళ్తే.. శివ శక్తి సాయి టీవీ ఛానెల్ నిర్వహకుడు రమణానంద మహర్షి తీరుపై కళ్యాణి కొంత కాలం క్రితం అసంతృప్తి వ్యక్తం చేశారు. రామాయణం, రాముడిని, హనుమంతుడిని రమణానంద అవమానించాడని.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారంటూ ఆమె కామెంట్లు చేశారు. దీంతో కళ్యాణికి వ్యతిరేకంగా తన ఛానెల్ లో ఆయన కథనాలను ప్రసారం చేశారు. నేను పేకాట లో ఆమె అరెస్ట్ అయ్యారని..  అలాగే ఆమె గతాన్ని బయటపెడతామంటూ సదరు ఛానెల్లో రెండు ఎపిసోడ్ లను టెలికాస్ట్ చేశారు. 

వీటిపై స్పందించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. చాలా మంది చాలా విధాలుగా మహిళపై అసభ్యంగా ప్రవరిస్తూ.. ఎన్నో దాడులు చేస్తున్నారు. ఇప్పుడు రమణానంద మహర్షి భక్తి ఛానెల్ వారు అసభ్య కథనాలతో నా పరువు తీశారు. . కేవలం నేను ఒక హిందు మహిళగా ఆయనను ప్రశ్నించాను’’ అని కళ్యాణి మీడియాకు చెప్పారు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కించపరుస్తున్నారు అంటూ కరాటే కళ్యాణి ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోను వదలను అని చెప్పు పెట్టు పడాల్సిందే అంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles