Sexual Allegations American Actor Commits Suicide | చైల్డ్ ఫోర్నోగ్రఫీ కేసు.. త్వరలో శిక్ష.. ఇంతలో సూసైడ్

American actor committee suicide

Mark Salling, Glee, Glee Actor, Glee Actor Glee, Sexual Allegations, Child Pornography

Glee Actor Mark Salling Found Dead at 35. Salling Dies Before Child Pornography Sentencing.

ఆత్మహత్యకు పాల్పడ్డ నటుడు మార్క్ సాలింగ్

Posted: 01/31/2018 10:20 AM IST
American actor committee suicide

హాలీవుడ్ లో కలకలం రేపిన మార్క్ సాలింగ్ లైంగిక ఆరోపణల వ్యవహారం విషాదాంతం అయ్యింది. మంగళవారం ఉదయం ఆయన తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 35 ఏళ్ల ఈ అమెరికన్ నటుడు లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నాడు.

పలు టీవీ సిరీస్ లలో నటించిన సాలింగ్ కు నటుడిగా మంచి పేరు ఉంది. 2015లో అతనిపై లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు 2016లో ఛార్జ్ షీట్ నమోదు చేశారు. అతని ల్యాప్ టాప్ ను పరిశీలించగా... దాదాపు 50 వేల చైల్డ్ పోర్నోగ్రఫీ ఫొటోలు, వీడియోలు లభించాయి. ఈ నేపథ్యంలో సాలింగ్ ను జడ్జి దోషిగా తేల్చారు. మార్చి 7న ఆయనకు శిక్ష ఖరారు కానుంది.

అయితే ఇంతలోనే మార్క్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆయన తరపు న్యాయవాది మైఖేల్ ప్రోకార్డ్ ఓ ప్రకటన ద్వారా తెలిపాడు. గత ఆగస్టులో ఆయన ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles