Anasuya says Not Aunty for Charan in Rangasthalam | క్లారిటీ ఇచ్చి.. ఎగ్జయిట్ మెంట్ పెంచిన అనసూయ

Anasuya clarity on rangasthalam role

Anchor Anasuya Bharadwaj, Rangasthalam Movie, Aunty Role, Ram Charan, Sukumar, Samantha

Anasuya given Clarity on her role in Rangasthalam Movie. In Twitter Conversation she replied to a fan that she was not Aunty role to Ram Charan.

రంగస్థలంలో అత్త పాత్ర కాదు : అనసూయ

Posted: 01/20/2018 03:53 PM IST
Anasuya clarity on rangasthalam role

హాట్ యాంకర్ అనసూయ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది. రంగస్థలంలో రామ్ చరణ్ కు తాను అత్త పాత్రలో నటించట్లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది.

గత కొంత కాలంగా ఆమె చెర్రీకి అత్త పాత్రలో కనిపించబోతుందని ఓ వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ట్విటర్ వేదికగా అభిమానులతో చిట్ ఛాట్ నిర్వహించింది. మధ్యలో ఓ అభిమాని ఇదే ప్రశ్నను లేవనెత్తగా... అనసూయ స్పందించింది.

మీరు రంగ స్థలంలో రామ్ చరణ్ కి అత్త పాత్రలో కనిపించబోతున్నారా? అంటే.. కాదు అనే సమాధానం ఇచ్చింది. దీంతో అనసూయ పాత్ర ఏంటన్న ఆసక్తి మరింతగా పెరిగిపోయింది. ఇప్పటికే బుల్లి తెరపై యాంకర్ గా హవా చాటుతున్న అనసూయ ఇప్పుడు సినిమాల్లో కూడా రాణిస్తూ ఆకట్టుకుంటోంది. శ్రీనివాస్ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న సచ్చింది రా గొర్రె అనే కామెడీ థ్రిల్లర్ చిత్రంలోనూ, మోహన్ బాబు గాయత్రిలోనూ అనసూయ ముఖ్యపాత్రలో కనిపించబోతోంది.

Anasuya Rangasthalam Tweet

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles