Vikram again fail in Execution Sketch | విక్రమ్ స్కెచ్ మూవీ టాక్.. వారి నాయనో!

Vikram sketch talk

Vikram, Tamannah, Vijay Chander, Sketch Movie, Vikram Sketch Movie Talk, Vikram Sketch Movie Review

Vikram Sketch movie gets disaster talk on First Day. A predictable action drama that ends up star-worshipping its protagonist a tad too much Directed by Vijay Chander

విక్రమ్ స్కెచ్ కు డిజాస్టర్ టాక్

Posted: 01/12/2018 07:08 PM IST
Vikram sketch talk

బాలా సేతు(తెలుగులో శేషు) చిత్రంతో తమిళంలో విక్రమ్ కు చియాన్ అనే పేరు పడిపోయింది. ఆ తర్వాత వరుసగా చిత్రాలు చేస్తూ వైవిధ్యభరిత నటుడిగా మంచి పేరును సంపాదించుకున్నాడు. అన్నియన్(అపరిచితుడి)తో విక్రమ్ కు తెలుగులోనూ స్టార్ డమ్ వచ్చేసింది.

అయితే అది నిలబెట్టుకోవటంలోనే విక్రమ్ దారుణంగా ఫేల్ అవుతూ వస్తున్నాడు. ఒక దాని తర్వాత ఒకటి డిజాస్టర్లుగా మారుతున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన ఐ కూడా విక్రమ్ కు హిట్ అందించలేకపోయింది. ఇరు మురుగన్(ఇంకోకడు) మాత్రమే కాస్త కలెక్షన్లపరంగా ఊరటనిచ్చింది. ఇక కాస్త గ్యాప్ ఈ నేపథ్యంలో నేడు విక్రమ్ స్కెచ్ కూడా రిలీజ్ అయ్యింది.

తమన్నా హీరోయిన్ గా విజయ్ చందర్ డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కగా.. నేడు రిలీజ్ అయ్యింది. ఇలా రిలీజ్ అయ్యిందో లేదో ఫస్ట్ షోకే సినిమాకు దారుణమైన టాక్ వచ్చింది. రెగ్యులర్ మాస్ కథ.. గతంలో చేసిన జెమినీ తరహాలోనే క్యారెక్టరైజేషన్.. బోరింగ్ నేరషన్ ఇవన్నీ సినిమా ఫలితాన్ని తేల్చేశాయి. చిత్రంలో ఒక్క క్లైమాక్స్ ట్విస్ట్ తప్ప ఏ అంశం కూడా ఆకర్షణీయంగా లేదని కోలీవుడ్ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikram  Sketch Movie  విక్రమ్  స్కెచ్ చిత్రం  

Other Articles