Manchu Manoj reveals his Son Name | తండ్రిపై విష్ణు ప్రేమతో..

Manchu vishnu reveals his son name

Manchu Manoj, Avram Bhakta Manchu, Mohan Babu Grand Son, Manoj Son Name, Manchu Manoj Father Name

Manchu Manoj reveals why he named his son Avram Bhakta Manchu.

తండ్రి పేరు వచ్చేలా తనయుడికి మంచు విష్ణు పేరు

Posted: 01/04/2018 04:39 PM IST
Manchu vishnu reveals his son name

కొత్త సంవత్సరం మంచువారింట పండగ వాతావరణం నెలకొంది. విష్ణు-విరానికా దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. దీంతో మనవడి కోసం మూడు షిఫ్టులు డ్యూటీ చేస్తున్నట్లు మోహన్ బాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తన కుమారుడి పేరేంటో విష్ణు తెలియజేశాడు కూడా.

ఈ రోజు విష్ణు ట్వీట్ చేస్తూ... తన కుమారుడిని అరియానా ‘బేబీ లయన్‌’ అని పిలుస్తోందని, వివియానా మాత్రం ‘బేబీ టెడ్డీ బేర్‌’ అని పిలుస్తోందని తెలిపారు. కానీ తాము మాత్రం వాడిని అవ్రామ్‌ భక్త అని పిలుస్తామని తెలిపాడు. అవ్రామ్‌ అంటే ఎవరూ ఆపలేని వ్యక్తి అని అర్థం చెప్పాడు.

సినీనటుడు మోహన్‌బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు అన్న విషయం తెలిసిందే. తన తండ్రి పేరు కలిసొచ్చేలా మంచు విష్ణు తన కుమారుడికి ‘అవ్రామ్‌ భక్త’ అని పేరుపెట్టాడు. విష్ణు దంపతులకు అరియానా, వివియానా అనే కవల ఆడ పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు నటించిన గాయత్రిలో నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles