Agnyaathavaasi Rare Record for Pawan | అజ్నాతవాసి... పవన్ ఖాతాలో రేర్ రికార్డు

Agnyaathavaasi pawan rare record

Pawan Kalyan, Agnyaathavaasi, Universal Studio, Los Angels, Special Show, Pawan Kalyan Universal Studio

Pawan kalyan Agnyaathavaasi Release in US Special Premium.

పవన్ అజ్నాతవాసి మరో రికార్డు

Posted: 12/26/2017 09:53 PM IST
Agnyaathavaasi pawan rare record

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `అజ్ఞాతవాసి` చిత్రం విడుద‌లకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే టీజ‌ర్‌కి అత్య‌ధిక వీక్ష‌ణ‌లు సంపాదించి ఈ చిత్రం రికార్డు సంపాదించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో ఘ‌న‌త‌ను ఈ చిత్రం సంపాదించబోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లోని యూనివర్శల్‌ స్టూడియోస్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారట. అక్కడి సిటీ వాక్‌ థియేటర్స్‌లో ప్రదర్శించబోయే తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ విషయానికి సంబంధించిన పోస్టర్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌అవుతోంది. 2018 జనవరి 9న ఈ చిత్రాన్ని సిటీ వాక్‌ థియేటర్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు, టీజర్‌ మంచి టాక్‌అందుకున్నాయి. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles