Egoistic Naga Chaitanya for Maruthi's Next | నాగ చైతన్య జబ్బేంటో తెలిసిపోయిందిగా...

Naga chaitanya character in maruthi movie

Naga Chaitanya, Director Maruthi, Sailaja Reddy Alludu, Anu Emmanuel, Ramya Krishna

Naga Chaitanya's New Characterisation for Maruthi Movie. Chaitu Ego Mannerism for Sailaja Reddy Alludu.

మారుతి సినిమా కోసం చైతూ పాత్ర ఎలాగంటే...

Posted: 12/26/2017 05:30 PM IST
Naga chaitanya character in maruthi movie

ఈ ఏడాది ఒక హిట్.. ఒక ఫ్లాప్ తో మిక్స్ డ్ ఫలితాన్ని చవిచూసిన నాగ చైతన్య.. పెళ్లి తర్వాత సినిమాల విషయంలో వేగం పెంచేశాడు. ప్రస్తుతం చందూ మొండేటితో సవ్యసాచి చేస్తున్న చైతూ.. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా ఒక సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లటానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాకి 'శైలజా రెడ్డి అల్లుడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే చైతూ కెరీర్ లోనే ఇంతవరకూ చేసిన పాత్రలకు భిన్నంగా ఈ పాత్ర ఉంటుందని టాక్ వినిపిస్తోంది. సినిమా సినిమాకు హీరో క్యారెక్టరైజేషన్ ను మారుతి డిఫరెంట్ గా చూపిస్తుంటాడు. 'కొత్తజంట' సినిమాలో హీరోను సెల్ఫీష్ గా, 'భలేభలే మగాడివోయ్' సినిమాలో హీరోని మతిమరుపు కలిగినవాడిగా, బాబు బంగారంలో వెంకీని అతి మంచి వాడిగా.. చివరకు 'మహానుభావుడు'లో హీరోను అతి శుభ్రత కలిగినవాడిగా చూపించి ఆడియన్స్ ను అలరించాడు.

ఇప్పుడు చైతూ విషయంలో కూడా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాలో హీరోపాత్ర ను డిఫరెంట్ గానే చూపించబోతున్నాడంట. 'ఇగో'తో కూడినదిగా ఉండి అత్త పాత్రను డామినేట్ చేసే విధంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles