Allu Arjun Impact Concept for Upcoming Movie | బన్నీ ఇంపాక్ట్.. మాటల్లేవ్ అంట!

Bunny impact concept for new movie

Allu Arjun, Naa Peru Surya Movie, Vakkantham Vamsi, First look, Impact Teaser, Allu Arjun New Movie, Bunny First look,

Allu Arjun New Impact concept for Naa Paeru Surya Movie. The Teaser may Cut with Action Episode along Bunny's Characterisation.

బన్నీ కొత్త చిత్రం ఇంపాక్ట్ ఎంతలా అంటే...

Posted: 12/26/2017 03:51 PM IST
Bunny impact concept for new movie

అల్లు అర్జున్ హీరోగా 'నా పేరు సూర్య'  నా ఇల్లు ఇండియా తెరకెక్కుతోంది. పవర్ ఫుల్ కథలను అందించే వక్కంతం వంశీ డైరెక్టర్ గా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా చేస్తున్న  ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తితో అల్లు అర్జున్ అభిమానులంతా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో జనవరి 1వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు ఇంపాక్ట్ రానున్నట్టు, ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దాంతో ఫస్టు ఇంపాక్ట్ అంటే ఏమిటి? ఫస్టు లుక్కా .. ఫస్టు టీజరా? అనే సందేహం అందరిలో తలెత్తింది. తాజాగా ఫస్టు ఇంపాక్ట్ విషయంలో క్లారిటీ వచ్చింది. ఫస్టు ఇంపాక్ట్ పేరుతో స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారట.

ఫస్టు ఇంపాక్ట్ కింద 80 సెకన్ల నిడివి గల ఒక స్పెషల్ టీజర్ ను జనవరి 1న వదలబోతున్నారు. డైలాగ్స్ లేకుండగా అల్లు అర్జున్ పాత్రపై ఈ టీజర్ ను కట్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. వాటితో ఈ టీజర్ ఫ్రేమ్ చేయబోతున్నారని సమాచారం. అయితే ఇది స్పెషల్ టీజర్ అనీ .. అసలైన టీజర్ ప్రమోషన్స్ లో భాగంగా వస్తుందనేది యూనిట్ సభ్యులు చెబుతోన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles