Pelli Choopulu Director's next a Road movie | పెళ్లి చూపులు తర్వాత కొత్త సినిమా సబ్జెక్ట్ అదేనంట!

Pelli choopulu director s next confirmed

Tharun Bhaskar, Road Movie, Pelli Choopulu Director, Tharun Bhaskar Next Movie, Tharun Bhaskar New Movie

Tharun Bhaskar’s next Confirmed. ‘road movie’ with all newcomers and shot in some locales in Goa and other places. “It is a very interesting and engaging road movie. Where the characters who are mostly young discover their inner self and life as well,” said an industry source. Earlier, ace director Ram Gopal Varma and director Shekar Suri explored this road movie genre in films like ‘Road’ and ‘A Film By Aravind’ respectively.

ఫీల్ గుడ్ సబ్జెక్ట్ తో పెళ్లి చూపులు దర్శకుడు

Posted: 12/23/2017 05:08 PM IST
Pelli choopulu director s next confirmed

టాలీవుడ్ లో చిన్న చిత్రంగా వచ్చి పెద్ద సక్సెస్ సాధించింది పెళ్లి చూపులు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ కు ప్రత్యేక ప్రశంసలు లభించాయి.  అనూహ్యమైన విజయం.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమాకు ఆఖండ విజయం కట్టబెట్టింది. దీంతో ఈ చిత్ర దర్శకుడి నుంచి రాబోయే తదుపరి చిత్రం గురించి అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. 

తరుణ్ భాస్కర్ కొత్త నటీనటులతో ఒక సినిమా చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఆయన తెరకెక్కించనున్నాడు. లాంగ్ జర్నీ నేపథ్యంలో సాగే రొమాంటిక్ మూవీ ఇది అని అంటున్నారు. స్నేహితులైన కొంతమంది అబ్బాయిలు .. అమ్మాయిలు దూర ప్రాంతానికి ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఆ ప్రయాణంలో తమని గురించి తాము తెలుసుకునే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందట.

దాదాపు పది నెలల పాటు ఈ సినిమా స్క్రిప్ట్ పై కూర్చున్న తరుణ్ భాస్కర్, ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles