Bunny Next confirmed with Thrilling Director | బన్నీ ఆల్ మోస్ట్ ఓకే చెప్పింది ఈ డైరక్టర్ కే!

Allu arjun next confirmed

Allu Arjun, Okka Kshanam Director, Vi Anand, Na Peru Surya Movie, Allu Arjun Vi Anand, Allu Arjun Next Movie, Vi Anand Bunny Movie, Ani Kanneganti, Ani Kanneganti Bunny, Ani Kanneganti

Allu Arjun Next Movie Confirmed with Vi Anand. Ekkadiki Pothavu Chinnavada Director proceed with Ani Kanneganti Story which already impressed Bunny.

బన్నీ నెక్స్ట్ మూవీ ఆనంద్ డైరెక్షన్ లోనే...

Posted: 12/18/2017 06:43 PM IST
Allu arjun next confirmed

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్(డెబ్యూ)లో నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత ఇంత దాకా ఏ ప్రాజెక్టును కన్ఫర్మ్ చేయలేదు. లింగు స్వామితో సినిమా కమిట్ అయినప్పటికీ.. ప్రస్తుతం ఆయన పందెం కోడి-2 డైరెక్షన్ లో బిజీ అయిపోవటంతో ఆ ప్రాజెక్టు మరోసారి సైడ్ అయిపోయింది. 

ఈ దశలో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో దర్శకుడు వీఐ ఆనంద్ బన్నీతో ఓ సినిమా కన్ఫర్మ్ అయినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనికి బలమిస్తూ మరో వార్త ఇప్పుడు వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన అల్లు శిరీశ్ తో 'ఒక్క క్షణం'తో చేయగా.. ఆ చిత్రం ఈ నెల 28వ తేదీన ఆయన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ గ్యాప్ లో శిరీష్ ద్వారా ఆనంద్ టేకింగ్ గురించి తెలుసుకున్న బన్నీ చిత్రాన్ని ఒఫ్పుకున్నట్లు తెలుస్తోంది. 

గతంలో మంచు మనోజ్ తో 'మిస్టర్ నూకయ్య' సినిమా చేసిన దర్శకుడు అని కన్నెగంటి, ఇటీవల అల్లు అర్జున్ ను కలిసి ఒక కథ చెప్పాడట. బన్నీకి ఆ కథ నచ్చడంతో భారీ మొత్తం చెల్లించి కొనేశాడంటూ వార్తలు వచ్చిన సంగతీ తెలిసిందే. తాను హీరోగా ఆ కథను తెరకెక్కించే బాధ్యతను ఆయన వి.ఐ.ఆనంద్ కి అప్పగించినట్టుగా చెప్పుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles