Mahanati Mass Background Score Bad Signals | మహానటి మాస్ మ్యూజిక్ మైనస్ కాదా?

New discussion on mahanati logo

Mahanati, Title Logo, Actress Savitri Biopic, Savitri Movie, Keerthy Suresh, Mahanati Music, Mahanati Back Ground Score, Mahanati Movie Music Director

Mahanati Title Logo launched. Video byte starts off with the famous dialogues picked from Savitri’s movies on an interesting note. Keerthy Suresh’s look has not been unveiled in the released video and the film’s logo has been unveiled. The background score leaves everyone in surprise as it has been tipped with a mass touch. The audience have been left puzzled if Mahanati is a biopic or a mass entertainer.

మహానటి లోగో పై కొత్త చర్చ

Posted: 12/07/2017 11:33 AM IST
New discussion on mahanati logo

నటి సావిత్రి 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సావిత్రి జయంతిని పురస్కరించుకుని నిన్న చిత్ర టైటిల్ లోగోను సర్ ప్రైజ్ అంటూ విడుదల చేశారు. సావిత్రి రోల్ లో కీర్తి సురేశ్ నటిస్తోన్న ఈ సినిమాలో జమున గా సమంత నటించబోతుందని చెప్పుకుంటున్నారు. దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, ప్రకాశ్ రాజు, షాలిని పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 29న విడుదల కాబోతోంది.

ఇన్నీ హంగులు ఉన్న ఈ చత్రం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వదిలిన టైటిల్ లోగో పై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ మొదలైంది. చిత్ర బ్యాగ్రౌండ్ లో సావిత్రి వాయిస్ ఓవర్ వినిపించటంతోపాటు చివర్లో ఓ మాస్ బీట్ ను వదిలారు. సావిత్రి లాంటి సాఫ్ట్ హీరోయిన్ బయోపిక్ కు ఈ మ్యూజిక్.. పైగా క్లాసిక్ సంగీతాన్ని అందించే మిక్కీ జే మేయర్ నుంచి ఏ మాత్రం సూట్ కాలేదు. అయితే లోగోను హైలెట్ చేయటానికే ఈ పని చేశారని చెబుతున్నారు.

ఇక సావిత్రి మహానటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానధర్మాలు చేయడం, అందరితో స్నేహపూర్వకంగా ఉండటం ఆమె మంచితనాన్ని మరింత పెంచిందంటారు. అలాంటి సావిత్రి .. వైవాహిక జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఆ బాధను మరిచిపోవడానికి చెడు వ్యసనాలకు బానిసై అనారోగ్యాన్ని కొనితెచ్చుకుని చనిపోయారు. అలాంటి వ్యక్తి బయోపిక్ లో నాగ్ అశ్విన్ దాపరికాలు లేకుండా చూపిస్తాడా? అన్నదే ఇప్పుడు అసలు పాయింట్.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles