Nargis Fakhri Clarifies on Marriage Rumour | మాజీ ప్రియుడితో పెళ్లి వార్తలపై స్పందించిన హీరోయిన్

Nargis fakri on wedding rumours

Nargis Fakhri, Uday Chopra, Nargis Fakhri Wedding Rumour, Nargis Fakhri Uday Chopra, Nargis Fakhri News

Nargis Fakhri And Uday Chopra Are Getting Married, Say Rumours. Nargis is presently based out of New York and not Mumbai," said the actress' spokesperson.

చోప్రాతో పెళ్లి వార్తలపై నర్గీస్ స్పందన

Posted: 11/30/2017 10:10 AM IST
Nargis fakri on wedding rumours

బాలీవుడ్ లో ఇప్పుడో హాట్ పుకారు తెగ చక్కర్లు కొడుతోంది. నటి నర్గీస్ ఫక్రీ, నటుడు కమ్ నిర్మాత ఉదయ్ చోప్రా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది.

గతవారం చోప్రా ఇంటి దగ్గర నర్గీస్ హడావుడి చేయటం.. తల్లి పమేలా చోప్రాతో చక్కర్లు కొట్టడటంతో ఆ వార్త మరింత బలపడింది. అయితే అలాంటిదేం లేదని పుణే మిర్రర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మేనేజర్ ఖండించాడు. ప్రస్తుతం ఆమె ముంబైలో లేరని.. అమెరికాలో ఉన్నారని చెప్పాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ముంబై వచ్చిన సమయంలో ఆమె ఇక్కడ బస చేస్తారే తప్ప.. వేరే కారణాలు లేవని వివరించాడు.

ఐదేళ్ల క్రితం వీరిద్దరూ తెగ చక్కర్లు కొడుతూ ఉండేవారు. ఆ సందర్బంలో వీరి రిలేషన్ ను ఓపెన్ గా ఒప్పేసుకున్నారు కూడా. అయితే తర్వాత గత ఏడాదిగా వీరిద్దరి మధ్య మాటల్లేవ్. దీంతో బ్రేకప్ అయిపోయారనే మరో వార్త చక్కర్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles