Rajasekhar Multi-Starrer Confirmed with Top Hero | వెంకీ సినిమాలో రాజశేఖర్.. ఆ పాత్రకి ఫిక్స్?

Rajasekhar multi starrer confirmed

Ata Nade Veta Nade Movie, Venkatesh, Rajasekhar, Director Teja, Venky Rajasekhar, Venkatesh Rajasekhar, Rajasekhar Multi-Starrer Movie

Venkatesh Teja Movie will become multi-starrer. Rajasekhar plays a pivotal Role in Ata Nade Veta Nade.

వెంకీ-రాజశేఖర్.. తేజ మల్టీస్టారర్?

Posted: 11/29/2017 06:21 PM IST
Rajasekhar multi starrer confirmed

గతంలో మల్టీస్టారర్ ఛాన్సులు మిస్సయిన రాజశేఖర్ మొత్తానికి ఓ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గరుడ వేగ సక్సెస్ తో హ్యాపీగా ఉన్న ఈ సీనియర్ నటుడు ఓ అగ్ర హీరో సినిమాలో కీలక పాత్ర చేయబోతున్నాడని చెబుతున్నారు. తేజ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'ఆటా నాదే వేటా నాదే' అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

వచ్చేనెల 13వ తేదీన వెంకటేశ్ పుట్టినరోజున ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఇంతవరకూ చేయని పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారని చెబుతున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ కి బావగా మరో కీలకమైన పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం రాజశేఖర్ ను తీసుకున్నట్టుగా సమాచారం. రాజశేఖర్ కి తేజ కథ చెప్పడం .. ఆయన ఓకే చెప్పేయడం ఆల్రెడీ జరిగిపోయాయని చెబుతున్నారు.

ఇప్పటిదాకా మహేశ్ బాబు .. రామ్.. పవన్ కల్యాణ్ లతో మల్టీ స్టారర్ మూవీస్ చేసిన వెంకటేశ్, రాజశేఖర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. ఇక తేజతో 'నేనే రాజు నేనే మంత్రి' రాజశేఖర్ చేయాల్సింది .. కానీ కుదరలేదు. ఇప్పుడు ఇలా పాత్ర చేయటం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles