టాలీవుడ్ లో ఈ మధ్య పోటాపోటీగా హీరోల చిత్రాలు విడుదల అవ్వటం చూస్తున్నాం. కలెక్షన్ల పరంగా దారుణంగా దెబ్బతీస్తున్న ఈ రివాజును కొంత మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ.. స్టార్ హీరోలు మాత్రం అస్సలు వెనక్కి తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో హీరో నాని కొత్త చిత్రం ఎంసీఏ రిలీజ్ డేట్ ప్రకటించటం ఆసక్తికర చర్చకు దారితీసింది.
దిల్ రాజు నిర్మాణంలో .. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన 'మిడిల్ క్లాస్ అబ్బాయి' వచ్చేనెల 21వ తేదీన విడుదల కానుంది. ఆ మరుసటి రోజునే అఖిల్ మూవీ 'హలో' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర నాని - అఖిల్ మధ్య వార్ జరగనుందని ఓసారి.. మరోసారి సినిమా ప్రీ రిలీజ్ అవుతోందని ఇలా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. 21నే ఫిక్స్ అంటూ ఓ పోస్టర్ ను మేకర్లు విడుదల చేయగా.. ఐడల్ బ్రెయిన్ విశ్లేషకుడు జీవీ ఎంసీఏ వర్సెస్ అఖిల్ అంటూ ఓ ట్వీట్ చేశాడు.
దీనిపై స్పందించిన నాని.. జీవి గారు ఇది మా మధ్య పోటీ కాదు. యుద్ధం సల్మాన్ ఖాన్ తోనంటూ ట్వీట్ చేశాడు. ఈ క్రిస్మస్ కి 'మిడిల్ క్లాస్ అబ్బాయి' .. 'టైగర్'కి 'హలో' చెబుతాడు .. అది తెలుగు సినిమా పవర్ .. అని అన్నాడు. హిందీలో సల్మాన్ చేసిన 'టైగర్ జిందా హై' క్రిస్మస్ కానుకగా వచ్చేనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు హీరోల మధ్య ఎప్పుడూ ఐక్యత ఉంటుందంటూ అర్థం వచ్చేలా నాని చేసిన ఈ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
It’s not a war between us jeevi gaaru .. it’s more like a war between us and Salman Khan :) This Christmas #MiddleClassAbbai will say #Hello to #Tiger ;)
— Nani (@NameisNani) November 28, 2017
Telugu cinema https://t.co/gs16N9cqqR
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more