Bobby Back to back Movies with Two Star Heroes | బాబీ దూకుడు.. కానీ, వెయిటింగ్ లిస్ట్ లోనే...

Director bobby upcoming movies

Director Bobby, Sai Dharam Tej, Ravi Teja, Ravi Teja Sai Dharam Tej, Bobby Sai Dharam Tej Movie

Director Bobby Back to Back Movies committed with Star Heroes. Raviteja and Sai Dharam Tej but, they committed with serial projects.

రవితేజ, సాయి ధరమ్ తేజ్ తో బాబీ చిత్రాలు

Posted: 11/24/2017 06:22 PM IST
Director bobby upcoming movies

టాలీవుడ్ లో తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో స్టార్ డైరెక్టర్ గా బాబీకి గుర్తింపు దక్కింది. తక్కువ టైంలో స్టార్ హీరోలను డీల్ చేసి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. దీంతో బ్యాక్ టూ బ్యాక్ రెండు చిత్రాలను అందించేందుకు రెడీ అయిపోయాడు.

తన తొలి హీరో రవితేజ కోసం ఒక మంచి కథను సిద్ధం చేశాననీ, త్వరలో తమ కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని ఇటీవలే చెప్పాడు. ప్రస్తుతం రవితేజ ఒప్పుకున్న సినిమాలు పూర్తి కాగానే తాము సెట్స్ పైకి వెళ్లడం జరుగుతుందని అన్నాడు. ఇక తర్వాత మెగా హీరోతో కూడా ఓ సినిమా ఉండబోతుందని చెప్పేశాడు. అదెవరో కాదు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్.

ఒకానొక సమయంలో తాను పూర్తి నిరాశలో వున్నప్పుడు, తేజు తనకి ఎంతో అండగా నిలిచాడని అన్నాడు. ఆయన ఇచ్చిన భరోసాను తాను ఎప్పటికీ మరిచిపోలేననీ .. తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని చెప్పాడు. తేజు కోసం ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి రెడీ చేశాననీ, ఆయనతో ఆ సినిమా తప్పకుండా చేస్తానని అన్నాడు. ప్రస్తుతం తేజు కూడా వరుసగా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో అవన్నీ పూర్తయ్యాకే బాబీ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles