Nani as Producer Giving Package of Surprises | నాని నిర్మాతగా ఇవ్వబోయే ఆ షాకులేంటో?

Nani producing movie surprises

Actor Nani, Nani Production House, Nani as Producer, Nani MCA Movie, Nani New Movie, Nani as Producer, Hero Nani Surprises

Actor Nani’s Multi-starrer Production: A Package of Surprises. Known Young Heroes with Less Remuneration. Nani Kick the promotions after MCA Release.

నాని నిర్మాతగా సర్ ప్రైజ్ లే...

Posted: 11/18/2017 12:38 PM IST
Nani producing movie surprises

నేచురల్ స్టార్ నాని ఏడాదికి మూడు చిత్రాలు చేస్తూ హిట్లు అందుకుంటున్నాడు. ఈ యేడాది ఇప్పటికే నేను లోకల్.. నిన్ను కోరి... చిత్రాలు హిట్ ఖాతాలో పడిపోగా... ఎంసీఏ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఆపై నాగ్ మల్టీస్టారర్ చిత్రంతో పాటు మరో రెండు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు.

ఇదిలా ఉంటే నాని నిర్మాతగా కూడా మారి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయి పోయిందని సమాచారం. అయితే ఇందులో నలుగురు తెలిసిన హీరోలు, హీరోయిన్లు నటించబోతున్నారంట. త్వరలోనే వారి పేర్లను రివీల్ చేస్తూ పోస్టర్లు కూడా వదలబోతున్నాడంట.

ఎంసీఏ చిత్రం రిలీజ్ అయ్యాక తన చిత్ర పనులను చూసుకోవటం మొదలుపెడతాడంట. అయితే ఇందులో నటించే నటులంతా కాస్త పేరున్న వారేనని తెలుస్తోంది. తక్కువ రెమ్యునరేషన్ తోనే వారందరినీ నటింపజేసిన నాని.. చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఇక ప్రమోషన్ల కోసం మాత్రం భారీగానే ఖర్చుపెట్టబోతున్నాడని చెప్పుకుంటున్నారు. మరి నాని ఇవ్వబోయే ఆ సర్ ప్రైజ్ ప్యాకులు ఏంటో తెలియాలంటే ఓ నెల రోజులు ఓపిక పట్టాల్సిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Nani  MCA Movie  నాని  ఎంసీఏ చిత్రం  

Other Articles

Today on Telugu Wishesh