Bandla Sensational Comments on Nandi Awards | ఇవి సైకిల్ అవార్డులు... నందిపై బండ్ల సంచలన వ్యాఖ్యలు

Bandla ganesh sensational comments

Bandla Ganesh, Nandi Awards, Mega Family, Director Gunasekhar, Nandi Awards, Nandi or Cycle Awards

Tollywood Producer Bandla Ganesh Sensational Comments on Nandi Awards. Called it as Cycle Awards later withdraw his Words. Director Gunasekhar also write a Post on No Nandi Awards for Rudhramadevi Movie.

నంది అవార్డులపై బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు

Posted: 11/16/2017 09:03 AM IST
Bandla ganesh sensational comments

ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నంది అవార్డుల విషయంలో విమర్శలు తారా స్థాయికి చేరాయి. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఆ హీరోలకు అవార్డులు ప్రకటించలేదంటూ బన్నీ వాసు, బండ్ల గణేశ్ ఓపెన్ గానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ అయితే ఈ విషయంలో ప్రభుత్వ తీరు సరిగా లేదంటూ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

ఇవి నంది అవార్డ్స్ కాదు..సైకిల్ అవార్డ్స్. ఆ అవార్డ్స్ కు సైకిల్ అవార్డ్స్ అని పేరు పెడితే బాగుంటుంది. నాడు ‘మగధీర’ సినిమాలో అద్భుతంగా నటించిన రామ్ చరణ్ కు అవార్డు ఇవ్వకుండా అన్యాయం చేశారు. అప్పుడు కూడా ‘మెగా’ ఫ్యామిలీకి అన్యాయం చేశారు అని అన్నాడు. ఇక తాను నిర్మించిన‘గోవిందుడు అందరివాడే’ చిత్రానికి ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా అవార్డు దక్కక పోవడంపై బండ్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘లెజెండ్’ సినిమా బ్లాక్ బస్టర్ అని నేను ఒప్పుకుంటాను. నా సినిమా ‘గోవిందుడు అందరివాడే’ యావరేజ్ గా ఉండొచ్చు. కానీ, ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా నటించాడు, అతనికి అవార్డు వస్తుందనుకున్నా. జ్యూరీ సభ్యులను ఈ సినిమా మరోమారు చూడాలని కోరుకుంటున్నా. అని కోరాడు.

ఎండా కాలం ఎండ కాస్తుంది. చలి కాలం చల్లగా ఉంటుంది. వర్షాకాలం వానొస్తుంది. అలానే, టీడీపీ కాలం ఇది. వాళ్లు ఏం చెబితే అది చేయాలి! ‘గోవిందుడు అందరివాడే’ కథ బాగుందని ఓ అవార్డు, చిరంజీవికి రఘపతి వెంకయ్యనాయుడు అవార్డులు ఇవ్వడం ఏదో కంటితుడుపుచర్యగా భావిస్తున్నా. అవార్డులు ఇచ్చే విషయంలో ‘మెగా’ ఫ్యామిలినీ నిర్లక్ష్యం చేశారు’ అని బండ్ల గణేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జ్యూరీ సభ్యులపై జాలి పడుతున్నాను తప్పా, వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కోపం లేదని, వాళ్ల చేతుల్లో ఏదీ లేదని..వాళ్లందరూ నంది అవార్డ్స్ పేర్లను ప్రకటించిన నటులు మాత్రమేనంటూ విమర్శించారు.

అయితే ప్రభుత్వ అవార్డ్స్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ‘ఇటువంటి వ్యాఖ్యలు కరెక్టు కాదన్నారు కాబట్టి, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా..క్షమాపణలు చెబుతున్నా. కానీ, ‘మెగా’ ఫ్యామిలీకి మాత్రం అన్యాయం జరిగింది’ అని బండ్ల గణేష్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోపక్క అవార్డులపై వ్యాఖ్యలు చేసే వారిపై మూడేళ్లపాటు అవార్డులకు అనర్హులిగా వేటు వేస్తారన్న ప్రకటన నేపథ్యంలో దర్శకుడు గుణశేఖర్ ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles