Mahesh's Bharat Anu Nenu Shooting Updates | సీఎం ఛాంబర్ లో ఏం జరుగుతోంది?

Bharat anu nenu shooting details

Mahesh Babu, Bharat Anu Nenu, Koratala Siva, Bharat Anu Nenu Shooting, Mahesh Babu CM Chamber, Mahesh24 Movie, Bharat Anu Nenu Progress

Mahesh Babu Bharat Anu Nenu Shooting Updates. Koratala Shoots Key Scenes in Assembly CM Chamber on Mahesh and Others.

భరత్ అను నేను.. షూటింగ్ అప్ డేట్స్

Posted: 11/06/2017 11:11 AM IST
Bharat anu nenu shooting details

స్పైడర్ దారుణ ఫలితం తర్వాత దాని నుంచి బయటపడేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అను నేను షూటింగ్ లో పాల్గొంటున్నాడు. గతంలో మహేష్ తో శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ ను అందించిన కొరటాల శివ డైరెక్షన్ లోనే ఈ చిత్రం తెరకెక్కుతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం పక్కా ప్లానింగ్ తో కొరటాల షూటింగ్ షెడ్యూల్ ను కానిచ్చేస్తున్నాడు. కంప్లీట్ పొలిటికల్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. లీడర్ తరహా కాన్సెప్ట్ లోనే ఉండబోతుందన్న హింట్ కొందరు అందించారు. తండ్రి చనిపోవడంతో ఆ స్థానంలో ముఖ్యమంత్రి అయిన యువకుడిగా మహేశ్ కనిపించబోతున్నాడని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 5 కోట్ల ఖర్చుతో అసెంబ్లీ సెట్ వేసి కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు.

దటీజ్ మహేష్

ప్రస్తుతం షెడ్యూల్ కూడా హైదరాబాద్ లోనే కానిచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి చాంబర్ సెట్ లో మహేష్-పోసాని అండ్ చిత్ర యూనిట్ మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీని తర్వాత వచ్చే షెడ్యూల్ ను వేరే ప్రాంతంలో చేయబోతున్నాడంట. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ఏప్రిల్ 27వ తేదీన విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles