Anupama Parameswaran about Me Too Campaign | అసభ్యంగా తాకేవారు.. ఒకలా చూసేవారు - అనుపమ పరమేశ్వరన్

Anupama about sexual harassment

Anupama Parameswaran, Anumapa Parameswaran Me Too Campaign, Me Too Campaign, Anupama Parameswaran Sexual Harassment

Anumapa Parameswaran about me too Campaign. Says She also one of the victim and its common in around world.

లైంగిక వేధింపుల గురించి అనుపమ

Posted: 10/30/2017 05:38 PM IST
Anupama about sexual harassment

హాలీవుడ్ లో హార్వే వెయిన్ స్టెన్ ఉదంతం తర్వాత మీ టూ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో ఉధృతంగా మారిపోయిన విషయం తెలిసిందే. మన దేశంలోనూ కాస్టింగ్ కౌచ్, హీరోయిన్ ల లైంగిక వేధింపుల గురించి భావన ఉదంతం తర్వాత అన్ని భాషల హీరోయిన్లు మీడియా ముందుకొచ్చి చెప్పటం చూశాం.

ఆ లిస్ట్ లో అనుపమా పరమేశ్వరన్ కూడా చేరిపోయింది. 'మీటూ'పై స్పందిస్తూ... ప్రతి అమ్మాయీ జీవితంలో అది సర్వసాధారణమేనని, తెలియకుండానే కొన్నిసార్లు అవి జరిగిపోతుంటాయని చెప్పింది. ‘‘ఉదాహరణకు బస్సులో కండక్టర్ తాకుతూ వెళ్తుంటారని.. మాటలతో వేధించేవాళ్లు, తప్పుడు చూపులు చూసేవారు, అవసరం లేకున్నా దగ్గరకు వచ్చి తాకాలని చూసేవాళ్లు. నాకూ ఎంతో మంది ఎదురయ్యారరు అని అనుపమ చెప్పింది.

అయితే ఆ సమయంలో హెచ్చరించే దానినని ఆమె తెలిపింది. అలా చెయ్యటం వల్ల పురుషులకు కలిగే ఆనందం ఏంటో తనకు తెలియడం లేదని చెప్పింది. అలాంటి వాళ్లు తమ ఇంట్లోనూ మహిళలు ఉంటారన్న విషయం ఎందుకు గుర్తు చేసుకోరు అని అనుపమ ప్రశ్నిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles