Amaal Strong Reply to Anu Malik Copy Marks | మేనమామ పాట కాపీ.. పెద్ద కాంట్రవర్సీ

Amaal reply to anu malik allegations

Anu Malik, Anu Malik Amaal Malik, Anu Malik Controversy, Anu Malik Song Copy, Anu Malik Issue, Amaal Ishq Saong Remake, Golmaal Again Neend Song

Anu Malik Lashes Out At Amaal For Not Giving Credits In ‘Neend Churai’ Remix In ‘Golmaal Again’. Amaal Strong Reply to His Uncle.

మేనల్లుడిపై మ్యూజిక్ డైరెక్టర్ ఫైర్

Posted: 10/27/2017 06:52 PM IST
Amaal reply to anu malik allegations

బాలీవుడ్ లో సీనియర్ సంగీత దర్శకుడు అనూ మాలిక్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. త‌న ట్యూన్‌ని రీమిక్స్ చేసి క్రెడిట్స్ లో త‌న పేరు ఇవ్వ‌లేద‌ని మేన‌ల్లుడు, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అమాల్ మాలిక్ పై ఆయన మండిపడుతున్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన‌ `గోల్‌మాల్ అగైన్‌` చిత్రం కోసం సంగీత ద‌ర్శ‌కుడు అమాల్ మాలిక్‌, `ఇష్క్‌` సినిమా కోసం అనూ మాలిక్ కంపోజ్ చేసిన అల‌నాటి `నీంద్ చూరాయి` పాట‌ను రీమిక్స్ చేశాడు.

అయితే ఆడియోలో ఒరిజిన‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా త‌న పేరు ప్ర‌స్తావించ‌క‌పోవ‌డంతో అనూ మాలిక్ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు.`పాట‌ను ఎలా కావాలంటే అలా మార్చుకోండి. కానీ ఒరిజిన‌ల్ ట్యూన్ ఇచ్చిన వారిని మ‌ర్చిపోవ‌డం స‌బ‌బు కాదు. అమాల్ బాగా ఎద‌గాల‌ని నేను కోరుకుంటాను. కానీ ఆడియోలో నా పేరు లేక‌పోవ‌డం వ‌ల్ల యువ‌త‌రానికి నా గురించి తెలియ‌క త‌ప్పుగా అర్థం చేసుకునే అవ‌కాశం ఉంది` అని అనూ మాలిక్ అన్నాడు.

అయితే అనూ మాలిక్ ఆరోప‌ణ‌లపై అమాల్ మాలిక్ మ‌రో ర‌కంగా స్పందించాడు. `ఆయ‌న‌ అనుమ‌తి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న కూడా ఈ పాట ట్యూన్‌ను ఇంగ్లిషులో లీనియ‌ర్ పాడిన‌ `సెండింగ్ ఆల్ మై లవ్‌` స్ఫూర్తితో రూపొందించాడు. మేం కూడా ఇంగ్లిషు పాట హ‌క్కుల‌ను తీసుకున్నాం. అయినప్పటికీ, ఈ పాట‌ను రీమిక్స్ చేసే ముందు అంకుల్ అనుమ‌తి తీసుకోవాల‌నుకున్నాం. అసలు రీమిక్స్ కూడా ఆయ‌న‌తోనే పాడించాల‌నుకున్నా. కానీ నా కాల్స్‌కి ఆయ‌న స్పంద‌న ఇవ్వ‌లేదు. దీంతో వ‌దిలేశా` అని అమాల్ మాలిక్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles