Balayya's Solo Sitting Video Viral | సింగిల్ సిట్టింగ్ లో బాలయ్య.. వీడియో వైరల్

Balayya new video viral

Balakrishna Viral Video, Balayya Solo Sitting, Balayya in Bar and Restaurant, Balayya Bar Video, Balayya Solo Sitting

Nandamuri Balakrishna Video Viral in Social Media. Balayya Single Sitting in a Bar and Restaurant, Some People Filmed that.

బాలయ్య సోలో వీడియో వైరల్ అవుతోంది

Posted: 10/26/2017 11:17 AM IST
Balayya new video viral

టాలీవుడ్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ శైలే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మిగతా హీరోల్లా ఆర్భాటాలకు ఆయన దూరం. చిత్ర షూటింగ్ సమయాల్లో మిగతా బృందంతో కలిసే ఉంటూ సందడి చేస్తుంటారు. ఎక్కడా టాప్ హీరో అన్న దర్పం చూపించరు. జోకులేస్తూ సరదాగా గడుపుతుంటారు. అయితే అదే సమయంలో ఆయనలో మరో కోణంపై విమర్శలు కూడా వస్తుంటాయి.

అభిమానులు.. పార్టీ కార్యకర్తలపై చెయ్యి చేసుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు కూడా. అయితే ఆయన లైఫ్ స్టైల్ మాత్రం చాలా సాధాసీదాగానే ఉంటున్నది మాత్రం పలుమార్లు రుజువైంది. తాజాగా బాలయ్య ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో సందడి చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఒక్కడే కూర్చుని పక్కనే బీర్ గ్లాస్.. ఏదో తింటున్నట్లు ఆ వీడియోలో ఉంది. అక్కడే ఉన్న కొందరు యువకులు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

ఎప్పుడు? ఏ సందర్భంలో తీశారో? తెలీదుగానీ.. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సాధారణ వ్యక్తిలా బాలయ్య అలా వ్యవహరించటం చూసి బాలయ్య సింప్లిసిటీకి ఇదే నిదర్శనమంటూ ఆయన అభిమానులు కామెంట్లు, షేర్లు చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య కేఎస్ రవికుమార్ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles