BMC Notices to Big B for Illegal Construction | ఇల్లీగల్ పని.. అమితాబ్ కు షాక్.. నోటీసులు

Illegal construction notices to big b

Amitabh Bachchan, Brihanmumbai Municipal Corporation, Brihanmumbai Municipal Corporation Big B, Big B Notices, Amitabh Bachchan, Amithabh and Other BMC Notices, అమితాబ్ బచ్చన్, బీఎంసీ నోటీసులు, అమితాబ్ అక్రమ నిర్మాణం

Amitabh Bachchan gets BMC notice over illegal construction. Mumbai's civic body - the Brihanmumbai Municipal Corporation - has issued a notice. According to the information received by Galgali, the notice was issued to seven persons including Rajkumar Hirani, Oberoi Realty, Pankaj Balaji, Sanjay Vyas, Haresh Khandelwal and Haresh Jagtani, besides Amitabh on December 7 2016 for the changes in their approved plans.

అమితాబ్ కు ముంబై కార్పొరేషన్ నోటీసులు

Posted: 10/26/2017 08:45 AM IST
Illegal construction notices to big b

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా తన లగ్జరీ బంగళా 'స్వాంక్'ను నిర్మించుకున్నారని ఆరోపిస్తూ పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక సంస్థ నోటీసులు జారీ చేసింది. దాన్ని ఎందుకు కూల్చరాదో తెలియజేయాలంటూ గడువు విధిస్తూ వీటిని పంపినట్లు సమాచారం.

అత్యంత విలాసవంతమైన ఈ భవనం ముంబైలోని గోరేగామ్ ఈస్ట్ ప్రాంతంలో ఫిలిం సిటీకి సమీపంలో ఉందన్న సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, అమితాబ్ బచ్చన్ తో పాటు ముంబై పరిధిలో అక్రమంగా బంగళాలు నిర్మించుకున్నారన్న ఆరోపణలపై నిర్మాతలు రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ వ్యాస్, హరీష్ జగిత్యాని, హరీష్ ఖండేల్ వాల్, పంకజ్ బాలాజీలతో పాటు ఓబరాయ్ రియల్టీ సంస్థకు కూడా మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారని మీడియా కథనాలు చెబతున్నాయి.

గతంలోనే స్వాంక్ భవంతిపై ఆరోపణలు రాగా అప్పటి అధికారులు అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి ఆ భవనం వ్యవహారం వెలుగులోకి రావటంతో టౌన్ ప్లానింగ్ అధికారులు తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా బంగళాను నిర్మించినట్లు తేల్చారు. పైగా బేస్ మెంటు, లిఫ్ట్, ప్రహరీగోడ తదితరాలు ఆమోదిత ప్లాన్ ప్రకారం లేవని తేల్చారు. దీంతో బిగ్ బికి నోటీసులు జారీ చేసినట్టు మునిసిపల్ అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles