Malayalam Legendary Director Passes Away | దిగ్గజ దర్శకుడు ఇక లేడు.. సెలబ్రిటీల స్పందన

Malayalam director passes away

Malayalam, Malayalam Movie, Malayalam Director, Malayalam Legendary Director, Malayalam IV Sasi, V Sasi Died, IV Sasi Passes Away, Aarodaam Director Died, Mollywood Director Died

Malayalam Legendary Director I V Sasi, National Award-Winning Director, Dies At 69. In 1982, I V Sasi won the Nargis Dutt Award for Best Feature Film on National Integration for Aarodaam.

దిగ్గజ దర్శకుడు శశి కన్నుమూత

Posted: 10/24/2017 05:25 PM IST
Malayalam director passes away

సౌత్ సినిమాల్లో చెరగని ముద్ర వేసిన దర్శకుడు ఐ.వి.శశి (69) ఇక లేరు. సుదీర్ఘంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇరవై ఏడేళ్ల వయసులో దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని శశి ప్రారంభించారు. ఉల్సవం చిత్రంతో ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. ఆపై ‘అనుభవం’, ‘1921’, ‘ఈట’, ‘మరిగయ’ తదితర చిత్రాలు గుర్తింపు సంపాదించుకున్నారు. ‘అవలుడే రావుక్కల్’ సినిమా సమయంలోనే నటి సీమను షూటింగ్ సెట్స్ లోనే పెళ్లి చేసుకోవటం విశేషం. శశి-సీమ దంపతులకు అను, అనీ ఇద్దరు పిల్లలు. 1982లో ఆరోదమ్ చిత్రానికిగానూ శశికి నర్గీస్ దత్ జాతీయ అవార్డు లభించగా.. 2015లో జేసీ డేనియల్ అవార్డుతో శశిని కేరళ ప్రభుత్వం సత్కరించింది.

కాగా, శశి మృతిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.‘మలయాళ చిత్ర పరిశ్రమలో గొప్ప వ్యక్తి శశి అని, చిత్ర పరిశ్రమలకు ఆయన చేసిన సేవలను ఎప్పడూ గుర్తుంచుకుంటామని పినరయి విజయన్ అన్నారు. నలభై ఐదేళ్లుగా తన స్నేహితుడైన శశి గొప్ప టెక్నీషియన్ అని, ఆయన మృతిపై ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు.

కమల్ హాసన్ స్పందిస్తూ.. తనకు సోదరి సమానురాలైన శశి సతీమణి, నటి సీమకు, మిగిలిన కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలుపుతున్నానని, వారికి తన ఆదరణ ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. సీనియర్ నటి రాధిక స్పందిస్తూ, డైనమిక్ దర్శకుడు శశితో కలిసి గతంలో పని చేశానని, ఆయన కుటుంబానికి తన సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. జయం రవి, పార్వతి నాయర్ తదితరులు కూడా శశి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malayalam  IV Sasi  మళయాళం  ఐవీ శశి  

Other Articles