Rajput Warn to Padmavati Makers Will burn Theaters | దీపిక ’పద్మావతి‘కి డెడ్లీ వార్నింగ్

Deadly warning to padmavati makers

Jai Rajputana Sangh, Padmavati Movie, Padmavati Theaters Burnt, Rajput Deadly Warn Padmavati, Padmavati Release Troubles, Jai Rajputana Sangh Padmavati, Padmavati Strong Warning, Padmavati Movie Sanjay Leela hansali Request

Jai Rajputana Sangh Warn Padmavati Makers. Demanded Screening Movie First them. if film is released without Their approval, Will burn cinema halls screening.

పద్మావతి థియేటర్లు తగలబెట్టేస్తాం!

Posted: 10/16/2017 11:21 AM IST
Deadly warning to padmavati makers

బాలీవుడ్ లో మోస్ట్ అవెయిటింగ్ మూవీగా పద్మావతి ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసుకుంది. కేవలం డైలాగ్ బిట్ లతో రిలీజ్ చేసిన ఈ చిత్ర ట్రైలర్ ఓ దృశ్య కావ్యంలా ఉందంటూ సినీ లోకం ప్రశంసలు కురిపించింది. దెబ్బలు యూట్యూబ్ లో రికార్డులు బద్ధలు అయ్యాయి.

అయితే సినిమా కథ విషయంలో మాత్రం ఉన్న అనుమానాలు ఇంకా తీరలేదు. చిత్రంలో రాణి పద్మావతి.. అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య రొమాంటిక్ తరహా సన్నివేశాలు తెరకెక్కించాడని దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పై ఆరోపణలు ఉన్నాయి. అందుకే గతంలో షూటింగ్ సమయంలో రాజ్ పుత్ సంఘాలు బన్సాలీతోసహా చిత్ర యూనిట్ పై దాడి చేశాయి కూడా. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 చిత్రం విడుదల కాబోతుండగా... మరో వార్నింగ్ వచ్చి పడింది.

ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసే ముందు తమకు ప్రదర్శించాలని జై రాజ్‌పుట్‌ సంఘ్‌ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు జై రాజపుట్‌ సంఘ్‌ వ్యవస్థాపకుడు భన్వర్‌ సింగ్‌ రెటా ఓ ప్రముఖ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. అలా చేయకుండా సినిమాను ప్రదర్శిస్తే మాత్రం థియేటర్లను తగలబెడతామని హెచ్చరించినట్లు ఈ కథనం ప్రచురించింది. సినిమాలో అలాంటిదేం లేదని.. చరిత్రను వక్రీకరించే యత్నమేదీ తాను చేయలేదని ఇదివరకే దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పలుమార్లు చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles