Senior Actress Warn Varma on NTR's Biopic | లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై వర్మకు హీరోయిన్ సాలిడ్ వార్నింగ్.. మరో బయోపిక్ అనౌన్స్

Senior actress warn varma on lakshmi s ntr

Senior Actress Vani Viswanath, Vani Viswanath, Vani Viswanath Warn Ram Gopal Varma, Varma Vani Vishwanath, Vani Vishwanath Warn Varma, Vani Vishwanath Balayya, Lakshmi's NTR Biopic

Senior Actress Vani Viswanath Warn Director Ram Gopal Varma over Lakshmi's NTR Movie. Protest if Varma Starts shooting of that Movie.

లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదం.. వర్మకు హీరోయిన్ వార్నింగ్

Posted: 10/13/2017 05:19 PM IST
Senior actress warn varma on lakshmi s ntr

సినిమా ఇంకా ప్రారంభం కాకముందే వర్మకు వార్నింగ్ లు వచ్చి పడుతున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ పై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి సీనియర్ నేతతో మొదలైన ఈ పర్వం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. ఏదైనా తేడాగా చూపిస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు సీనియర్ నటి వాణి విశ్వనాథ్ కూడా వచ్చి చేరారు.

ప్రజలు దేవుడిగా చూసే ఎన్టీఆర్ గౌరవానికి భంగం కలిగించేలా సినిమాను తీస్తే, చూస్తూ ఊరుకోబోమని... వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ లో రాముడిని, కృష్ణుడిని ప్రజలు చూసుకున్నారని అన్నారు. సినిమాను తెరకెక్కించే ప్రయత్నాన్ని వెంటనే ఆపేయాలని అన్నారు. ఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్ ను బాలకృష్ణ తీయబోతున్న తరుణంలోనే... ఇలాంటి సినిమాను తీయడానికి వర్మ ప్రయత్నిస్తుండటం సరైంది కాదని తెలిపారు.

టైటిల్ తోనే వర్మ వ్యాపారం చేస్తూ వివాదం రాజేస్తున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం దురుద్దేశంతోనే వర్మ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని మండిపడ్డారు. సినిమాను గొప్పగా తీస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ఈ సినిమా తీయడం మానేయాలనే తాను వర్మను కోరుతున్నానని చెప్పారు. ఇక ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ సినిమాలో లీడ్ రోల్ బాలయ్యేనని ఓ క్లారిటీ ఇచ్చేశాడు. తేజ దర్శకుడిగా.. సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించబోతున్నాడని తెలియజేశాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles