No Mega Hero in Mass Raja Upcoming | ఈ ఫోటో చూసి మోసపోకండి-డెరెక్టర్

Anil ravipudi on mega rumour

Director Anil Ravipudi, Raja The Great Movie, Sai Dharam Tej, Guest Role, Raashi Khanna, Director Anil ravipudi

Director Anil Ravipudi Clarify on Mega Hero Guest Role in Raviteja's Raja The Great Movie. Sai Just Casually appear on movie sets and take a selfie.

రవితేజ సినిమాలో మెగా హీరో లేడు!

Posted: 10/13/2017 04:23 PM IST
Anil ravipudi on mega rumour

ఈ మధ్య ఒక హీరో సినిమాల్లో.. మరోకరు గెస్ట్ రోల్ లో నటించటం చాలా కామన్ గా మారిపోయింది. స్టోరీ నచ్చి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ అయితే చాలూ ముందు వెనక చూడకుండా హీరోలు నటించేస్తున్నారు. యంగ్ హీరోలు అయితే ఈ లిస్ట్ లో చాలా ముందు ఉన్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మొన్నామధ్య నక్షత్రం సినిమాలో కూడా నటించాడు. అయితే అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక ఇప్పుడు మాస్ రాజా రాజా ది గ్రేట్ లో నటించాడన్న వార్త ఒకటి వినిపించింది.

ఈ చిత్రంలో రాశీఖన్నా ఓ గెస్ట్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. రాశీతోపాటు లీడ్ పెయిర్ రవితేజ, మెహ్రీన్.. వీరికి తోడుగా సాయి అంతా కలిసి ఓ సెల్ఫీ దిగారు. దీంతో ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ ఓ అతిథిపాత్రను పోషించాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై దర్శకుడు అనిల్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో కేవలం రాశీఖన్నా మాత్రమే అతిథి పాత్రను పోషించిందని తేల్చేశాడు.

సాయి సరదాగానే సెట్ కు వచ్చాడని తెలిపారు. ఆ సమయంలో తీసుకున్న సెల్ఫీనే సోషల్ మీడియాలో దర్శనమిచ్చిందని చెప్పాడు. రవితేజ అంధుడి పాత్రలో రాధిక ఓ ముఖ్యపాత్రలో నటించిన రాజా ది గ్రేట్ రేపు(అక్టోబర్ 14న) ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించి... దీపావళి కానుకగా ఈ నెల 18న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh