Rajamouli Next Movie Starts in 2018 Only | రాజమౌళి తర్వాతి సినిమాపై ఓ క్లారిటీ

Rajamouli about his next

Director Rajamouli, Rajamouli Next Movie, Rajamouli's Next, SS Rajamouli Next Movie, Rajamouli Next Hero

Director Rajamouli maintain suspense over his next project. Still no story and Cast but will starts from 2018 Mid.

రాజమౌళి తర్వాతి సినిమా ఎవరితోనంటే...

Posted: 10/12/2017 06:09 PM IST
Rajamouli about his next

బాహుబలి ది కంక్లూజన్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తర్వాతి చిత్రం ఎవరితోనన్న విషయంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్, నాని, ధనుష్, రవితేజ, ప్రభాస్, చివరకు బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్... ఇలా పూటకో పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తాను రెస్ట్ లో ఉన్నానని ఇది వరకే రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

మరిప్పుడు రాజమౌళి అసలు ఏం చేస్తున్నాడు? జక్కన్న సినిమా స్టార్ట్ చేస్తేనే ఏళ్లు గడుస్తుంది. ఇక ఆయన ఏ సినిమా తీయాలా అని ఆలోచిస్తున్నాడంటే ఎంత సమయం పడుతుందో అని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ రాజమౌళి మాత్రం ఇంతవరకు తన నిర్ణయాన్ని చెప్పలేదు. అయితే కొన్ని రోజులుగా అయన ధనుష్ తో ఓ ప్రయోగాత్మకమైన సినిమాను ప్లాన్ చేస్తున్నారని వార్తలు బాగానే వచ్చాయి.
కానీ అది నిజమో కాదో ఎవ్వరికి తెలియదు.

రాజమౌళి కూడా ఇంతవరకు ఏ సినిమా.. ఎవరితో అనేది క్లారిటి ఇవ్వలేదు. ఎన్ని రూమర్స్ వినపడుతున్నా జక్కన్న మాత్రం నెక్స్ట్ సినిమా విషయంలో సస్పెన్స్ చూపిస్తూనే ఉన్నాడు. ఏది ఏమైనా? హీరో ఎవరైనా వచ్చే ఏడాది లోనే రాజమౌళి సినిమా ఉండబోతుందన్నది స్పష్టం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles