Juhi Chawla There Is Only One Supreme Court In India | నటికి... సుప్రీం కోర్టు ఎక్కడుందో తెలీదా?

Juhi chawla trolled about supreme court tweet

Actress Juhi Chawla, Supreme Court, Ban on Sale of Firecrackers, Delhi and NCR, Actress Troll, Actress Supreme Court Troll, Actress Supreme Court Tweet

Actress Juhi Chawla expressed her joy as the Supreme Court put a ban on sale of firecrackers in Delhi and NCR this Diwali. She shared the tweet with the caption, “Brilliant move by Delhi supreme Court, firecrackers banned till November 1! Celebrate this Diwali with Diyas & love (sic).”

జూహీని ట్రోల్ చేసి పడేస్తున్నారు

Posted: 10/11/2017 10:42 AM IST
Juhi chawla trolled about supreme court tweet

నోరే కాదు.. సోషల్ మీడియాలో చెయ్యి జారినా సరే సెలబ్రిటీలను ఏకీ పడేసేందుకు రెడీగా ఉంటారు. తప్పు సరిదిద్దుకోవటానికి కూడా వీల్లేకుండా క్షణాల్లో వాటిని స్క్రీన్ షాట్లు తీసి మరీ వైరల్ చేసేస్తుంటారు. తాజాగా
బాలీవుడ్ సీనియర్ నటి జూహీ చావ్లాకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఫ్లో ఆమె చేసిన ఓ ట్వీట్ ఆమె కొంప ముంచింది.

ఢిల్లీ, చుట్టు పక్కల ప్రాంతం నేషనల్ కేపిటల్ రీజియిన్ (ఎన్‌సీఆర్) పరిధిలో బాణసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీనిని హర్షిస్తూ ఈ సీనియర్ నటి ట్విట్టర్ లో స్పందించింది. ‘‘ఢిల్లీ సుప్రీం కోర్టు బహ్మాండమైన తీర్పు ఇచ్చింది. నవంబరు 1వ తేదీ వరకు బాణసంచాపై నిషేధం ఉండాల్సిందే. ఈ దీపావళిని ప్రేమ, ఆప్యాయలతో జరుపుకోండి’’ అని ట్వీట్ చేసింది. అంతే ఆ పొరపాటుతో ఆమెపై ఘోరమైన కామెంట్లు వచ్చి పడ్డాయి.

దేశానికి ఉండేది ఒక్క సుప్రీం కోర్టు కదా.. ఈ ఢిల్లీ సుప్రీంకోర్టు ఏంటి తల్లీ? అంటూ ప్రశ్నించారు. ఇంకొందరైతే అది జుహీ సుప్రీంకోర్టు కాబోలు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీకి విషయం తెలిదేమో.. ఇప్పుడు ప్రతీ రాష్ట్రంలోనూ ఓ సుప్రీంకోర్టు ఉందని మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు. మరొకరైతే జుహీని హిందూ విరోధిగా పేర్కొంటూ అది ఢిల్లీ సుప్రీంకోర్టు కాదని, భారత సుప్రీంకోర్టు అని చీవాట్లు పెట్టాడు. అలా ఆత్రుతతో ఆమె చేసిన ట్వీట్ ఇలా వైరల్ అవుతుందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles